మోటొరోలా (Motorola) నుంచి త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ (Smartphone) లాంచ్ కానుంది. G సిరీస్ నుంచి రానున్న ఈ డివైజ్ పేరు మోటో G72 (Moto G72). ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మల్టిపుల్ సెర్టిఫికేషన్స్ వెబ్‌సైట్‌లలో గుర్తించారు. G72 ప్రపంచవ్యాప్తంగా FCC, TDRA, IMEI డేటాబేస్‌లలో లిస్ట్ అయింది. అదే ఫోన్ భారతదేశంలోని BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) డేటాబేస్‌లో కూడా కనిపించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కూడా త్వరలో లాంచ్ అవుతుందని మొబైల్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డివైజ్‌కి సంబంధించి ఆయా వెబ్‌సైట్‌లలో కొన్ని వివరాలు కనిపించాయి. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్పీడ్ వంటి కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను అందించాయి. ఇప్పుడు ఓ కొత్త నివేదిక భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
* మోటో G72 లాంచ్ టైమ్, స్పెసిఫికేషన్లు
మోటో G72 స్మార్ట్‌ఫోన్ 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 5Gకి సపోర్ట్ చేయదని నివేదిక చెబుతోంది. మోటో G72 4G ఇండియన్ వేరియంట్‌కు ‘విక్టోరియా22’ అనే కోడ్‌నేమ్ ఉంది. దాని మోడల్ నంబర్ XT2255-2. ఇది BISలో గుర్తించిన మోడల్ నంబర్ కావడం గమనార్హం. లాంచ్ టైమ్‌లైన్ విషయానికొస్తే, ఈ డివైజ్ భారతదేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో లాంచ్ అవుతుందని నివేదిక స్పష్టం చేస్తోంది. అయితే లాంచ్ చేసిన వారం లేదా రోజు గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.
* ఇండియన్ వేరియంట్ ప్రత్యేకతలు
ఈ సెప్టెంబర్‌లో మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ సెప్టెంబర్ 8న లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మోటో G72 ఎడ్జ్ 30 సిరీస్ ఫోన్ తర్వాత లాంచ్ అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
‘విక్టోరియా22’ కోడ్‌నేమ్‌తో రానున్న మోటో G72 4G స్మార్ట్‌ఫోన్‌లో 48MP మెయిన్ స్నాపర్, 8MP సెకండరీ షూటర్, 2MP కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ స్నాపర్ ఉంటుంది. తాజా ఫోన్ కొత్త మీడియాటెక్ SoC లేదా హీలియో G37 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : త్వరలో ఐఫోన్ 14 సిరీస్ లాంచ్.. ఓల్డ్ జనరేషన్ ఐఫోన్లపై అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు..
* రూ.15 వేల లోపు ఉండే అవకాశం
మోటో G72 4GB ఫోన్ వర్చువల్ RAM సపోర్ట్‌తో 6GB/8GB RAM ఆప్షన్‌లలో వస్తుంది. సెర్టిఫికేషన్స్ వెబ్‌సైట్‌లలో గుర్తించిన వివరాల ప్రకారం, ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ధరపై ఎటువంటి సమాచారం లేనప్పటికీ, అందుబాటులో ఉన్న స్పెసిఫికేషన్‌ల ఆధారంగా దీని ధర రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Moto, Motorola, Smart phones, Tech news