Motorola Edge 20: మోటోరోలా ఎడ్జ్ సిరీస్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్లు... ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే

Motorola Edge 20: మోటోరోలా ఎడ్జ్ సిరీస్​లో రెండు కొత్త స్మార్ట్​ఫోన్లు... ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే

Motorola Edge 20 | మోటోరోలా నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ కానున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్ మోడల్స్ రానున్నాయి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ మోటరోలా.. ఎడ్జ్ సిరీస్​లో కొత్తగా రెండు స్మార్ట్​ఫోన్లను రూపొందించింది. ఎడ్జ్​ 20, ఎడ్జ్​ 20 ఫ్యూజన్ పేరుతో వీటిని త్వరలో ఆవిష్కరించనుంది. ఈ రెండు స్మార్ట్​ఫోన్లు ఆగస్టు 17న భారత్​లో అమ్మకానికి రానున్నాయి. అయితే భారత మార్కెట్​లోకి ఇంకా రిలీజ్​ కాకముందే.. వీటి ధరలు, స్పెసిఫికేషన్లు ఆన్​లైన్​లో లీకయ్యాయి. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ కేవలం రూ. 21,000 ధర వద్ద లభించనుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. మోటరోలా ఎడ్జ్​ ధర రూ. 30 వేల వరకు ఉంటుందని అంచనా. గత నెలలోనే ఈ రెండు మోడల్స్​ను యూరోపియన్​ మార్కెట్​లోకి లాంచ్​ చేశారు. మోటరోలా ఎడ్జ్​తో పాటు ఎడ్జ్​ 20 ప్రో, 20 లైట్​ అనే మూడు మోడల్స్​ను ఇంతకు ముందు విడుదల చేసింది. ఈ క్రమంలో మోటరోలా ఎడ్జ్ 20 లైట్​ మోడల్​కు కొనసాగింపుగా భారత మార్కెట్​లోకి మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్​ను తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

Vivo Y12G: రూ.10,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కావాలా? వివో వై12జీ సేల్ మొదలైంది

Unlimited Data Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ ఇవే

ధర, స్పెసిఫికేషన్లు


ప్రముఖ టిప్‌స్టర్ చేసిన ట్వీట్ ప్రకారం, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ మొత్తం రెండు వేరియంట్లలో రానుంది. ఇది 6జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​తో పాటు 8 జీబీ ర్యామ్​ ,128జీబీ స్టోరేజ్ గల​ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. 6GB వేరియంట్ రూ. 21,499 వద్ద, 8GB వేరియంట్ రూ. 23,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

Google: మీ గూగుల్ అకౌంట్ ఎంతవరకు సేఫ్? ఈ సెట్టింగ్స్ మార్చండి

Smartphone Tips: పాత మొబైల్ అమ్ముతున్నారా? డేటా ఇలా డిలిట్ చేయండి

మరోవైపు, మోటరోలా ఎడ్జ్ 20 సింగిల్ వేరియంట్​లో లభిస్తుంది. ఇది 8GB + 128GB స్టోరేజ్ ఆప్షన్​లోనే లభిస్తుంది. ఈ వేరియంట్ రూ. 29,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. మోటరోలా ఎడ్జ్​ 20 ఫ్యూజన్​ 10 బిట్​ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మీడియా టెక్​ డైమెన్సిటీ 800U SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. కాగా, యూరోపియన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన మోటరోలా ఎడ్జ్ 20 లైట్ మోడల్‌లో మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC ప్రాసెసర్‌ను అందించడం విశేషం.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెన్సార్ అల్ట్రా-వైడ్ యాంగిల్, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్ కెమెరాను చేర్చింది. దీని ముందు భాగంలో, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ కెమెరాను అందించింది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్​పై పనిచేస్తుంది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5G సపోర్ట్​తో వస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: