Motorola smartwatch: మోటరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. లాంఛ్ ఎప్పుడంటే..

Motorola smartwatch: మోటరోలా నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. లాంఛ్ ఎప్పుడంటే..

ఫ్రతీకాత్మక చిత్రం

Motorola Smart Watch: ఒప్పో నుంచి గతంలో విడుదలైన స్క్వేర్ డయల్ స్మార్ట్ వాచ్ ధర రూ.15000 వరకు ఉంది. మోటో వాచ్‌ కూడా ఇదే ధరలో లభించవచ్చు.

  • Share this:
అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటొరోలా కొత్త స్మార్ట్‌ వాచ్‌లను తయారు చేస్తోంది. సర్కిల్, స్క్వేర్ మోడల్‌లో మొత్తం రెండు స్మార్ట్‌ వాచ్‌లను ఆ సంస్థ రూపొందిస్తోంది. స్క్వేర్ డయల్ మోడల్ వాచ్‌ చూడటానికి యాపిల్ స్మార్ట్‌వాచ్ మాదిరిగానే ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్‌లో లీక్ అయ్యాయి. స్మార్ట్‌వాచ్‌ల విభాగంలో రూపొందిన మొదటి స్మార్ట్ వాచ్.. మోటో 360ని పోలి ఉండే మరో వేరియంట్‌ను కూడా ఆ సంస్థ అభివృద్ధి చేస్తోంది. మోటొరోలా 2015లో మోటో 360ని మార్కెట్లోకి విడుదల చేసింది. తరువాత దీన్ని భారత్‌లో విడుదల చేశారు. కానీ అప్పట్లో ఈ మోడల్‌ కస్టమర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా దీనికి అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను ఆ సంస్థ తయారు చేస్తోంది.

మోటొరోలా బ్రాండ్ లైసెన్స్ పొందిన eButNow నుంచి తాజా స్మార్ట్‌వాచ్‌ల సమాచారం బయటకు వచ్చింది. వీటిని మోటొరోలా సొంతంగా తయారు చేయట్లేదు. మోటో బ్రాండ్ లైసెన్సింగ్ సంస్థలు స్మార్ట్‌ వాచ్‌లను రూపొందిస్తున్నాయి. ఈ డివైజ్‌ల ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి కూడా మోటో అధికారికంగా వెల్లడించలేదు. లీక్ అయిన సమాచారంలో కూడా ఈ వివరాలపై స్పష్టత లేదు.

రెండు మోడళ్లూ ప్రత్యేకమే
స్క్వేర్ డయల్ మోడల్‌కు Moto Watch, రౌండ్ డయల్ ఉన్న మరో మోడల్‌కు Moto G Watch అని పేరు పెట్టారు. వీటిని ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరం జూన్, జూలైలో ఇవి లాంచ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రౌండ్ డయల్ Moto G వాచ్ ధర తక్కువగా ఉండవచ్చు.

గూగుల్ ఓఎస్ సపోర్ట్‌
మోటో వాచ్, మోటీ జీ స్మార్ట్ వాచ్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌, గూగుల్ వేర్ ఓఎస్‌ సపోర్ట్‌తో పనిచేయనున్నాయి. హార్ట్ రేట్ మానిటర్, జీపీఎస్ సెన్సార్, ఇతర ఫిట్‌నెస్‌ ఫీచర్లు ఈ స్మార్ట్‌ వాచ్‌లలో ఉండే అవకాశం ఉంది. షియోమీ రూపొందించిన రౌండ్ డయల్‌ Mi రివాల్వ్ స్మార్ట్ వాచ్, ఇతర వేరియంట్లతో మోటో జీ వాచ్ పోటీ పడనుంది. భారతదేశంలో Mi రివాల్వ్ ధరను రూ.9999గా నిర్ణయించారు. 5ATM వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌, AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో దీన్ని రూపొందించారు. దీంట్లో వివిధ రకాల ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. మోటీ జీ వాచ్‌లో కూడా ఈ ఫీచర్లను ఆశించవచ్చు.

ఆ మోడల్ ధర ఎక్కువ
యాపిల్ స్మార్ట్‌ వాచ్‌ను పోలి ఉండే స్క్వేర్ డయల్ మోటో వాచ్ ట్రెండీగా కనిపిస్తోంది. దీని ధర మోటో జి వేరియంట్‌ కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఒప్పో నుంచి గతంలో విడుదలైన స్క్వేర్ డయల్ స్మార్ట్ వాచ్ ధర రూ.15000 వరకు ఉంది. మోటో వాచ్‌ కూడా ఇదే ధరలో లభించవచ్చు.

https://twitter.com/FelipeBerhau/status/1365148948692877313?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1365148948692877313%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.mysmartprice.com%2Fgear%2Fmoto-g-watch-moto-watch-leaked%2F

https://twitter.com/FelipeBerhau/status/1365157896422629377?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1365157896422629377%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.mysmartprice.com%2Fgear%2Fmoto-g-watch-moto-watch-leaked%2F
First published:

అగ్ర కథనాలు