ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ మోటొరోలా (Motorola) ఇండియాలో అద్భుతమైన ఫోన్స్ పరిచయం చేస్తోంది. ఈ ఫోన్లు ఆఫర్ చేసే ఫీచర్లకు వినియోగదారులు అట్రాక్ట్ అవుతున్నారు. ఈ కంపెనీ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ డివైజ్ మోటో రేజర్ 2022 (Moto Razr 2022) కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు. అయితే వీరందరికీ తాజాగా కంపెనీ తీపి కబురు అందించింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. Razr 3 అని పిలిచే Moto Razr 2022 ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు Moto X30 Pro ని ఆగస్టు 2న చైనాలో లాంచ్ చేస్తామని వెల్లడించింది. అంటే ఇంకో వారం రోజుల్లో ఈ ఫోన్ చైనీస్ మొబైల్ మార్కెట్లో సందడి చేయనుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ త్వరలోనే ఇండియాలో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ల వంటి ముఖ్య వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* స్పెసిఫికేషన్లు
మోటో రేజర్ 2022తో పాటు Moto X30 Pro ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఆగస్టు 2న చైనాలో విడుదల చేయనున్నట్లు స్మార్ట్‌ఫోన్ కంపెనీ తెలిపింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 (Qualcomm Snapdragon 8+ Gen 1) ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో రానుంది. ఈ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఒక ఫోల్డబుల్ డివైజ్ రావడం ఇదే తొలిసారి. Moto Razr 2022లో కొత్త myui 4.0 OSని కంపెనీ అందించవచ్చని వార్తలు వస్తున్నాయి. 6.7-అంగుళాల P-OLED FHD+, 120Hz ఫోల్డబుల్ డిస్‌ప్లే, 12 GB LPDDR5 RAM, 512 G వరకు UFS 3.1 స్టోరేజ్, 3-అంగుళాల కవర్ డిస్‌ప్లే, 2800mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 OS వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో మోటో రేజర్ 2022 వచ్చే అవకాశం ఉంది. ఈ అమెరికన్ సంస్థ Razr సిరీస్‌లో 2020, 2021లో రెండు ఫోల్డబుల్ ఫోన్‌లను వినియోగదారులకు పరిచయం చేసింది. అయితే కొత్తగా వస్తున్న Razr 2022 గత మోడల్స్ కంటే అత్యధిక, మెరుగైన ఫీచర్లతో రావచ్చని తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ Moto X30తో పాటు చైనా కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు (ఇండియాలో సాయంత్రం 5 గంటలకు) లాంచ్ అవుతుంది. మోటొరోలా ఇదే ఈవెంట్‌లో myui 4.0 OSని కూడా పరిచయం చేస్తుంది. కంపెనీ అధికారిక ప్రకటనతో పాటు టీజర్ కూడా విడుదల చేసింది. వీటి ప్రకారం, ఇవి రెండూ మల్టీఫుల్-కెమెరా సెటప్‌తో వస్తాయి. మోటో లేటెస్ట్ కస్టమ్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, MyUI 4.0 కూడా అదే రోజున ఆవిష్కరించవచ్చని సమాచారం. Moto X30 Pro శాంసంగ్ 200 MP ISOCELL HP1 కెమెరా సెన్సార్‌తో వస్తుందట. ఈ కెమెరాతో వస్తున్న మొట్ట మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. Razr 2022 కొన్ని గేమ్‌లను రన్ చేయడానికి లార్జ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్‌తో లాంచ్ అవుతుంది.
మోటో రేజర్ 2022 ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్
మోటో రేజర్ 2022 గ్లోబల్ మార్కెట్‌లో EUR 1,149 (సుమారు రూ. 94,000) ధరతో ఎంట్రీ ఇవ్వని అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ క్వార్ట్జ్ బ్లాక్, ట్రాంక్విల్ బ్లూ కలర్ ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Motorola, Smart phones, Tech news