హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Motorola: 200MP కెమెరా ఫోన్‌ను లాంచ్ చేయనున్న మోటొరోలా.. ఆ నెలలోనే మార్కెట్లోకి విడుదల..

Motorola: 200MP కెమెరా ఫోన్‌ను లాంచ్ చేయనున్న మోటొరోలా.. ఆ నెలలోనే మార్కెట్లోకి విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటొరోలా (Motorola) నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. ఈ డివైజ్‌ పేరును కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్(Budget) ఫోన్లతో పాటు మిడ్ రేంజ్, ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లను కూడా కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి. వివిధ బ్రాండ్‌ల నుంచి అనేక టాప్ మోడల్స్ ప్రీమియం సెగ్మెంట్‌లో లాంచ్ అయ్యాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటొరోలా (Motorola) నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను(Smartphone) లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. ఈ డివైజ్‌ పేరును కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న మోటొరోలా ఫ్రాంటియర్ ఫోన్ ఇదే కావచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. కంపెనీ ఈ ఫోన్ టీజర్‌ను షేర్ చేసింది. డివైజ్ లాంచింగ్ వివరాలను కూడా వెల్లడించింది.

* మోటొరోలా ఫ్రాంటియర్ లాంచ్ వివరాలు

త్వరలో మార్కెట్లోకి రానున్న మోటొరోలా ఫ్రాంటియర్ ఫోన్‌ను కంపెనీ జులైలో లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఇది 200MP కెమెరాతో రానున్న ప్రీమియం డివైజ్. మోటొరోలా ఇంత భారీ సెన్సార్‌తో ఫోన్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారి. అయితే తాజా టీజర్‌లో ఈ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్లను కంపెనీ బహిర్గతం చేయలేదు. స్పెక్స్‌ వివరాలను వెల్లడించలేదు. కానీ దీని డిజైన్, కెమెరా, ఇతర వివరాలు ఇటీవలే లీక్ అయ్యాయి. లీకైన ఫోటోలో మోటొరోలా ఫ్రాంటియర్ ముందు, వెనుక డిజైన్‌ కనిపిస్తోంది.

iPhone 13 Price Cut: భారీగా తగ్గిన ఐఫోన్ 13 ధర.. ఈ బంపరాఫర్‌ను ఇలా సొంతం చేసుకోండి..


* మోటొరోలా ఫ్రాంటియర్ స్పెసిఫికేషన్స్

ఫ్రాంటియన్ ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. 200MP ప్రైమరీ సెన్సార్ ఈ ఫోన్‌లో స్పెషల్ అట్రాక్షన్. దీంతోపాటు మరో రెండు రియర్ లెన్స్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి అల్ట్రా-వైడ్ యూనిట్ కావచ్చు. వెనుకవైపు LED ఫ్లాష్, మోటొరోలా బ్రాండింగ్‌ లోగో కూడా కనిపిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 60MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది 30fps వద్ద 8K వీడియోలను రికార్డ్ చేయగలదు. ఈ డివైజ్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పంచ్-హోల్ పోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

కొత్తగా లాంచ్ అయిన స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలను కంపెనీ ధ్రువీకరించాల్సి ఉంది. ఇది 8GB/12GB RAM.. 128GB/256GB వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీతో రానుంది. ఇది 125W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 30W లేదా 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డిజైన్, ఇతర స్పెసిఫికేషన్‌లను కంపెనీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ డివైజ్ ధరల గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

First published:

Tags: 5g smart phone, 5G Smartphone, Motorola