హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Motorola: నవంబర్ చివరినాటికి మోటో ఫోన్లకు 5G సపోర్ట్‌.. అప్‌డేట్స్ టైమ్‌లైన్‌ ప్రకటించిన మోటొరోలా

Motorola: నవంబర్ చివరినాటికి మోటో ఫోన్లకు 5G సపోర్ట్‌.. అప్‌డేట్స్ టైమ్‌లైన్‌ ప్రకటించిన మోటొరోలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నవంబర్‌ చివరినాటికి భారతదేశంలో 5Gకి సపోర్ట్‌ చేసేలా తమ ఫోన్లకు అప్‌డేట్‌ అందిస్తామని మోటొరోలా స్పష్టం చేసింది. 5G నెట్‌వర్క్‌లకు సపోర్ట్‌ పొందబోతున్న డివైజ్‌ల వివరాలను, టైమ్‌లైన్‌ను కూడా కంపెనీ వెల్లడించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Motorola : ఇండియాలో 5Gకి సపోర్ట్‌ చేసేలా అన్ని మొబైల్ కంపెనీలు(Mobile Companies) తమ ఫోన్లను అప్‌డేట్‌ చేయాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే వివో, ఒప్పో వంటి కంపెనీలు తమ డివైజ్‌లకు అప్‌డేట్‌ను(Update) అందించాయి. నవంబర్‌లో శామ్‌సంగ్‌, డిసెంబర్‌లో యాపిల్‌ కంపెనీలు అప్‌డేట్‌ అందిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించింది మోటొరోలా కంపెనీ. నవంబర్‌ చివరినాటికి భారతదేశంలో 5Gకి సపోర్ట్‌ చేసేలా తమ ఫోన్లకు అప్‌డేట్‌ అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది. 5G నెట్‌వర్క్‌లకు సపోర్ట్‌ పొందబోతున్న డివైజ్‌ల వివరాలను, టైమ్‌లైన్‌ను కూడా మోటొరోలా వెల్లడించింది.

అన్ని బ్యాండ్స్‌కు సపోర్ట్‌

భారతదేశంలోని మోటొరోలా 5G స్మార్ట్‌ఫోన్‌లు కేటగిరీల వారీగా 11 నుంచి 13 5G బ్యాండ్‌లకు సపోర్ట్‌ చేస్తాయని చెప్పారు మోటొరోలా ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ మణి. ఇండియాలో ప్రకటించిన 8 సబ్ 6 GHz 5G బ్యాండ్‌లకు మోటో ఫోన్లు హార్డ్‌వేర్ సపోర్ట్‌ను అందించగలవని తెలిపారు.

‘ఇండియాలో 5Gని ఎనేబుల్ చేయడానికి ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ అప్‌డేట్ దేశంలోని స్టాండలోన్‌, నాన్-స్టాండలోన్ 5G నెట్‌వర్క్‌లకు కంపాటిబిలిటీని అందిస్తుంది. మేము ఇప్పటికే SA (రిలయన్స్ జియో), NSA (Airtel & Vi) 5G మోడ్‌లలో 5Gని ప్రారంభించడం కోసం OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ప్రారంభించాం. మోటరోలా డివైజ్‌లకు ఏకకాలంలో 5G సేవలను వినియోగించే సపోర్ట్ లభిస్తుంది. వినియోగదారులు అంతరాయం లేని 5Gని ఎక్స్‌పీరియన్స్‌ చేసే అవకాశం కల్పిస్తుంది.’ అని ప్రశాంత్ వివరించారు.

Google Passkeys: ఆండ్రాయిడ్‌, క్రోమ్‌ యూజర్లకు పాస్‌కీస్‌ సపోర్ట్‌..గూగుల్‌ అందిస్తున్న కొత్త ఫీచర్ ప్రత్యేకతలు..

ఇండియాలో ఈ మోడళ్లకు 5G అప్‌డేట్‌

మోటొరోలా 5G ఫోన్‌లు చాలా వరకు నవంబర్ ప్రారంభంలోనే భారతదేశంలో 5G నెట్‌వర్క్‌లకు సపోర్ట్‌ ఇవ్వనున్నాయి. ఈ అప్‌డేట్ ఫోన్‌లను Jio, Airtel, Vodafone Idea 5G నెట్‌వర్క్‌లలో పని చేయడానికి ఉపయోగపడుతుంది. అక్టోబర్ 10న మోటో ఎడ్జ్‌ 30 అల్ట్రా(Moto Edge 30 Ultra), అక్టోబర్‌ 11న మోటో ఎడ్జ్‌ 30 ఫ్యూజన్‌(Moto Edge 30 Fusion), అక్టోబర్ 25న మోటో G62 5G(Moto G62 5G), మోటో G82 5G(Moto G82 5G), మోటో ఎడ్జ్‌ 30(Moto Edge 30), మోటో G71 5G(Moto G71 5G) అప్‌డేట్‌ను అందుకుంటాయని మోటొరోలా ప్రకటించింది. అదే విధంగా నవంబర్‌ 5న మోటో ఎడ్జ్‌ 30 ప్రో(Moto Edge 30 Pro), మోటో G51 5G(Moto G51 5G), మోటో ఎడ్జ్‌ 20 ప్రో(Moto Edge 20 Pro), మోటో ఎడ్జ్‌ 20(Moto Edge 20), మోటో ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌(Moto Edge 20 Fusion) అప్‌డేట్‌ అందుకుంటాయి.

First published:

Tags: 5g mobile, Motorola

ఉత్తమ కథలు