వీకెండ్లో సినిమాలు, ఆన్లైన్ క్లాసుల కోసం ట్యాబ్లెట్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మోటోరోలా సరికొత్త ట్యాబ్లెట్ ఇండియాలో రిలీజ్ కాబోతోంది. మోటోరోలా ట్యాబ్ జీ70 (Motorola Tab G70) ట్యాబ్లెట్‌ను త్వరలో రిలీజ్ చేయనుంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా ట్యాబ్లెట్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిపోవడం, ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ కోర్సులకు అలవాటు పడటంతో ట్యాబ్లెట్స్ కొంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా కంపెనీలు కొత్త ట్యాబ్లెట్లను పరిచయం చేస్తున్నాయి. గతేడాది రియల్మీ ప్యాడ్ (Realme Pad), నోకియా టీ20 ట్యాబ్ (Nokia T20 Tab) రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మోటోరోలా ట్యాబ్ జీ70 రాబోతోంది.
మోటోరోలా ట్యాబ్ జీ70 స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్. మోటోరోలో స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు. ఈ ట్యాబ్లెట్ కూడా అలాగే ఉండబోతోంది. ఇందులో 7,700 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. 20వాట్ ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో గూగుల్ ఎంటర్టైన్మెంట్ స్పేస్ ప్రత్యేకంగా ఉండటం విశేషం.
మోటోరోలా ట్యాబ్ జీ70 ట్యాబ్లెట్లో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లో లభించనుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మోటోరోలా ట్యాబ్ జీ70 ట్యాబ్లెట్లో క్వాడ్ స్పీకర్స్, డ్యూయెల్ మైక్ సెటప్, డ్యూయెల్ బ్యాండ్ వైఫై లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
మోటోరోలా ట్యాబ్ జీ70 ధర ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రియల్మీ ప్యాడ్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 కాగా, నోకియా టీ20 ట్యాబ్లెట్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. ఇక కొద్ది రోజుల క్రితం మోటో ట్యాబ్ జీ20 ట్యాబ్లెట్ రూ.10,999 ధరకు రిలీజ్ అయింది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఈ ట్యాబ్లెట్ లభిస్తుంది. మోటోరోలా ట్యాబ్ జీ70 సరిగ్గా ఏ రోజున రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు. అయితే జనవరి 10న మోటో జీ71 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఆరోజునే ఈ ట్యాబ్ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.