సెప్టెంబర్ 24న 'మోటోరోలా వన్ పవర్' లాంఛింగ్!

మోటోరోలా నుంచి వన్, వన్ పవర్ ఫోన్లను బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2018లో ప్రకటించింది కంపెనీ. అందులో 'మోటోరోలా వన్ పవర్' ఇండియాలో లాంఛయ్యే ముహూర్తం ఖరారైంది.

news18-telugu
Updated: September 18, 2018, 5:59 PM IST
సెప్టెంబర్ 24న 'మోటోరోలా వన్ పవర్' లాంఛింగ్!
మోటోరోలా వన్ పవర్
  • Share this:
లెనోవోకు చెందిన మోటోరోలా నుంచి మరో కొత్త ఫోన్ ఇండియాలో లాంఛ్ కానుంది. సెప్టెంబర్ 24న మోటోరోలా వన్ లాంఛ్ చేయనున్నట్టు ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించింది కంపెనీ. ఆండ్రాయిడ్ వన్‌తో పనిచేస్తుంది ఈ ఫోన్. 8.0 ఓరియోతో వచ్చే ఈ ఫోన్‌కు త్వరలోనే 'ఆండ్రాయిడ్ 9 పై' అప్‌డేట్స్ కూడా లభిస్తాయి. గూగుల్ లెన్స్‌తో డ్యూయెల్ కెమెరాలు పనిచేయడం విశేషం. 5000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ, టర్బో పవర్ ఛార్జింగ్, 4జీ ఎల్‌టీఈ, వీఓఎల్‌టీఈ, వైఫై, జీపీఎస్ లాంటి ఫీచర్లున్నాయి.


మోటోరోలా వన్ పవర్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే

ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636
రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: సుమారు రూ.14,000

ఇవి కూడా చదవండి:

విశాఖలో గూగుల్ 'నైబర్లీ' సేవలు!

2019 మార్చి నుంచి 'ఇన్‌బాక్స్' యాప్ కనిపించదు!

19న షావోమీ ఎంఐ 8 యూత్ లాంఛింగ్!

ఐఫోన్ ఎక్స్ఎస్: ఏ దేశంలో రేటెంత?

భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు!

పెట్రోల్ కొంటారా? పేటీఎం సూపర్ ఆఫర్!
Published by: Santhosh Kumar S
First published: September 18, 2018, 5:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading