గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

మోటోరోలా వన్ పవర్ ఆండ్రాయిడ్ వన్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్. 5000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ రెండురోజుల వరకు పనిచేస్తుందని హామీ ఇస్తోంది మోటోరోలా. టర్బో పవర్ ఛార్జింగ్ మరో ప్రత్యేకత. 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఆరు గంటల పాటు ఫోన్ ఉపయోగించుకోవచ్చు.

news18-telugu
Updated: September 24, 2018, 5:07 PM IST
గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'
మోటోరోలా వన్ పవర్
  • Share this:
ఇండియన్ మార్కెట్‌లో షావోమీ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీకావు. తక్కువ టైమ్‌లోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకెళ్లింది షావోమీ. ఆ కంపెనీ తీసుకొచ్చిన ప్రతీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటూ సేల్స్‌లో దూసుకెళ్లేవి. ఇకపై షావోమీకి తిరుగులేదనుకున్నారు. కానీ ఇటీవల పోటీ కంపెనీలు రిలీజ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్లన్నీ షావోమీకి గట్టిపోటీ ఇచ్చేవే. ఇప్పుడు అలాంటి మరో ఫోన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. అదే 'మోటోరోలా వన్ పవర్'. షావోమీకి చెందిన రెడ్‌మీ నోట్ 5 ప్రో, ఎంఐ ఏ1, ఎంఏ2, త్వరలో లాంఛ్ కానున్న రెడ్‌మీ నోట్ 6 ఫోన్లకు గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్లకూ పోటీ తప్పదు.

లెనోవోకు చెందిన మోటోరోలా కంపెనీ వన్, వన్ పవర్ ఫోన్లను బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2018లో ప్రకటించింది. అందులో 'మోటోరోలా వన్ పవర్'ను ఇండియాలో గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్‌ కోసం రూపొందించింది కావడం మరో విశేషం. కేవలం ఆన్‌లైన్‌లోనే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజీవ్‌గా అక్టోబర్ 5న సేల్స్ మొదలవుతాయి. అయితే రిజిస్ట్రేషన్ మాత్రం ఇప్పటికే ప్రారంభమైపోయింది. మోటో హబ్స్‌లో కూడా సేల్స్ ఉంటాయి.

MOTOROLA, LENOVO, Motorola One Power, SMARTPHONE, ANDROID, మోటోరోలా, లెనోవో, మోటోరోలా వన్ పవర్, స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్
మోటోరోలా వన్ పవర్


ఇది ఆండ్రాయిడ్ వన్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్. గూగుల్ లెన్స్‌తో డ్యూయెల్ కెమెరాలు పనిచేయడం విశేషం. 5000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ రెండురోజుల వరకు పనిచేస్తుందని హామీ ఇస్తోంది మోటోరోలా. టర్బో పవర్ ఛార్జింగ్ మరో ప్రత్యేకత. 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఆరు గంటల పాటు ఫోన్ ఉపయోగించుకోవచ్చు. 8.0 ఓరియోతో వచ్చిన ఫోన్‌కు ఈ ఏడాది చివరినాటికి 'ఆండ్రాయిడ్ 9 పై' అప్‌డేట్స్ కూడా లభిస్తాయి. వచ్చే రెండేళ్ల వరకు అప్‌గ్రేడ్స్ అందిస్తామని చెబుతోంది కంపెనీ. అంతేకాదు... మరో మూడేళ్ల వరకు ప్రతీ నెలా అప్‌డేట్స్ ఇస్తామని మోటోరోలా హామీ ఇచ్చింది. టైప్‌-సీ కనెక్టర్, బ్లూటూత్ 5.0, హాట్‌స్పాట్, వైఫై డైరెక్ట్, 4జీ ఎల్‌టీఈ, వీఓఎల్‌టీఈ, జీపీఎస్ లాంటి ఫీచర్లున్నాయి.

మోటోరోలా వన్ పవర్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, 1080x2246 పిక్సెల్స్
ర్యామ్: 4 జీబీఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636
రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.15,999

ఇవి కూడా చదవండి:

Photos: ఈ నెలలో టాప్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

కార్డ్ పేమెంట్స్: తీసుకోవాల్సిన 30 జాగ్రత్తలు!

'ఆయుష్మాన్ భారత్' పథకం గురించి తెలుసా?

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే లాభాలేంటో తెలుసా?

Video: కాపురాల్లో చిచ్చురేపుతున్న వీడియో గేమ్ వ్యసనం!
Published by: Santhosh Kumar S
First published: September 24, 2018, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading