ఇవాళే 'మోటోరోలా వన్ పవర్' సేల్!

ఇది ఆండ్రాయిడ్ వన్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్. గూగుల్ లెన్స్‌తో డ్యూయెల్ కెమెరాలు పనిచేయడం విశేషం. 5000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ రెండురోజుల వరకు పనిచేస్తుందని హామీ ఇస్తోంది మోటోరోలా.

news18-telugu
Updated: October 5, 2018, 9:07 AM IST
ఇవాళే 'మోటోరోలా వన్ పవర్' సేల్!
ఇది ఆండ్రాయిడ్ వన్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్. గూగుల్ లెన్స్‌తో డ్యూయెల్ కెమెరాలు పనిచేయడం విశేషం. 5000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ రెండురోజుల వరకు పనిచేస్తుందని హామీ ఇస్తోంది మోటోరోలా.
  • Share this:
అదిరిపోయే ఫీచర్స్‌తో బడ్జెట్ సెగ్మెంట్‌లో మోటోరోలా తీసుకొచ్చిన 'మోటోరోలా వన్ పవర్' సేల్ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో మొదలుకానుంది. లెనోవోకు చెందిన మోటోరోలా కంపెనీ బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2018లో ప్రకటించిన ఫోన్లల్లో 'మోటోరోలా వన్ పవర్' కూడా ఒకటి. ఈ ఫోన్‌ను ఇటీవలే అధికారికంగా లాంఛ్ చేసిన కంపెనీ... అక్టోబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఉంటుందని ప్రకటించింది. ఈ ఫోన్ ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్‌ కోసం రూపొందించింది కావడం మరో విశేషం.

ఇది ఆండ్రాయిడ్ వన్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్. గూగుల్ లెన్స్‌తో డ్యూయెల్ కెమెరాలు పనిచేయడం విశేషం. 5000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ రెండురోజుల వరకు పనిచేస్తుందని హామీ ఇస్తోంది మోటోరోలా. టర్బో పవర్ ఛార్జింగ్ మరో ప్రత్యేకత. 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఆరు గంటల పాటు ఫోన్ ఉపయోగించుకోవచ్చు. 8.0 ఓరియోతో వచ్చిన ఫోన్‌కు ఈ ఏడాది చివరినాటికి 'ఆండ్రాయిడ్ 9 పై' అప్‌డేట్స్ కూడా లభిస్తాయి. వచ్చే రెండేళ్ల వరకు అప్‌గ్రేడ్స్ అందిస్తామని చెబుతోంది కంపెనీ. అంతేకాదు... మరో మూడేళ్ల వరకు ప్రతీ నెలా అప్‌డేట్స్ ఇస్తామని మోటోరోలా హామీ ఇచ్చింది. టైప్‌-సీ కనెక్టర్, బ్లూటూత్ 5.0, హాట్‌స్పాట్, వైఫై డైరెక్ట్, 4జీ ఎల్‌టీఈ, వీఓఎల్‌టీఈ, జీపీఎస్ లాంటి ఫీచర్లున్నాయి.

మోటోరోలా వన్ పవర్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, 1080x2246 పిక్సెల్స్
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636

రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: రూ.15,999

ఇవి కూడా చదవండి:

Photos: 2018లో రిలీజైన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఇవే!

Photos: టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

Video: ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

షావోమీ నుంచి ఐదు కొత్త ప్రొడక్ట్స్!

Video: సెల్ఫీ తీసుకుంటున్నారా? ఒక్క నిమిషం
Published by: Santhosh Kumar S
First published: October 5, 2018, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading