మోటోరోలా నుంచి మరో రెండు ఫోన్లు!

మోటోరోలా నుంచి వన్, వన్ పవర్ ఫోన్లు త్వరలో రానున్నాయి. బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2018లో వీటిని ప్రకటించింది కంపెనీ.

news18-telugu
Updated: September 4, 2018, 6:20 PM IST
మోటోరోలా నుంచి మరో రెండు ఫోన్లు!
మోటోరోలా నుంచి వన్, వన్ పవర్ ఫోన్లు త్వరలో రానున్నాయి. బెర్లిన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఏ 2018లో వీటిని ప్రకటించింది కంపెనీ.
  • Share this:
లెనోవోకు చెందిన మోటోరోలా మరో రెండు కొత్త ఫోన్లను ప్రకటించింది. మోటోరోలా వన్, వన్ పవర్ పేరుతో ఈ రెండు ఫోన్లు త్వరలో రానున్నాయి. ఆండ్రాయిడ్ 8.0 ఓరియోతో వచ్చే ఈ ఫోన్లకు త్వరలోనే 'ఆండ్రాయిడ్ 9 పై' తో పాటు, 'ఆండ్రాయిడ్ క్యూ' అప్‌డేట్స్ కూడా లభిస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ రెండు ఫోన్ల స్పెసిఫికేషన్స్‌లో కొన్ని తేడాలున్నాయి. గూగుల్ లెన్స్‌తో డ్యూయెల్ కెమెరాలు పనిచేస్తాయి. టర్బో పవర్ ఛార్జింగ్, 4జీ ఎల్‌టీఈ, వీఓఎల్‌టీఈ, వైఫై, జీపీఎస్ లాంటి ఫీచర్లున్నాయి. మోటోరోలా వన్ పవర్ ఇండియాలో అక్టోబర్‌లో లాంఛ్ కానుంది. మోటోరోలా వన్ మాత్రం యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ దేశాల్లో లాంఛ్ కానుంది.

మోటోరోలా వన్ పవర్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636
రియర్ కెమెరా: 16+5 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 12 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: సుమారు రూ.14,000

మోటోరోలా వన్ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.9 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625
రియర్ కెమెరా: 13+13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: సుమారు రూ.24,800

ఇవి కూడా చదవండి:

రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్ల ఫీచర్స్ ఇవే!

యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!

సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఆండ్రాయిడ్‌ గోతో సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్!

#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?

ఇండియాలో లాంఛైన రియల్‌మీ 2

5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్

Photos: కొత్త ఐఫోన్స్ ఇలానే ఉంటాయా?

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
First published: August 31, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading