MOTOROLA ONE FUSION PLUS FIRST FLASH SALE TODAY ON FLIPKART KNOW PRICE AND SPECIFICATIONS SS
Motorola: కాసేపట్లో 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' సేల్... ధర ఎంతంటే
ప్రతీకాత్మకచిత్రం
Motorola One Fusion+ | మోటోరోలో వన్ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది కంపెనీ. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. ఇటీవల 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేసింది కంపెనీ. మోటోరోలా వన్ సిరీస్‌లో రిలీజ్ అయిన మరో స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ ధర సుమారు రూ.25,000 ఉంటుందని అంచనా వేశారు. కానీ రూ.16,999 ధరకే రిలీజ్ చేసి షాక్ ఇచ్చింది మోటోరోలా. 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, పాప్ అప్ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 15 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. స్టోరేజీ 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 24 మధ్యాహ్నం 12 గంటలకు మోటోరోలా వన్ ఫ్యూజన్+ సేల్ ప్రారంభం కానుంది.
Say Hello to infinite power in the one & only motorola one fusion+, which comes with 5000 mAh battery with TurboPower™ charging. Quit worrying about running out of charge with #TheUltimateOne for just ₹16,999 from 24th June, 12 PM onwards on @Flipkart! https://t.co/1gWnfWBwtLpic.twitter.com/1pVzHxEYfl
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.