Motorola Moto E20: బడ్జెట్​ ధరలోనే అదిరిపోయే కెమెరా ఫీచర్స్... మోటో ఈ20 వచ్చేసింది

Motorola Moto E20: బడ్జెట్​ ధరలోనే అదిరిపోయే కెమెరా ఫీచర్స్... మోటో ఈ20 వచ్చేసింది

Motorola Moto E20 | మోటోరోలా నుంచి అదిరిపోయే ఫీచర్స్‌తో మోటో ఈ20 (Moto E20) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) సరికొత్త బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. మోటో ఈ 20 (Moto E20) పేరుతో కొత్త స్మార్ట్​ఫోన్​ను (Smartphone) యూరప్‌లో లాంచ్​ చేసింది. ఈ కొత్త మోటోరోలా ఫోన్​లో అనేక అద్భుతమైన ఫీచర్లను జోడించింది. ఇందులో HD+ డిస్‌ప్లే, యూనిసోక్ SoC ప్రాసెసర్​ వంటివి అందించింది. మోటోరోలా Moto E20 డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మోటో E సిరీస్​లో E 20 తో పాటు మోటో E40 ని కూడా లాంచ్​ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మోటో E20 ధర, స్పెసిఫికేషన్లు పరిశీలిద్దాం.

మోటో E20 ధర


మోటరోలా మోటో E20 సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 2GB ర్యామ్​ + 32GB స్టోరేజ్ మోడల్ EUR 99.99 (సుమారు రూ. 8,700) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కోస్టల్ బ్లూ, గ్రాఫైట్ గ్రే అనే రెండు కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతానికి యూరప్​ మార్కెట్​లోకి విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్​.. భారత్​లోకి ఎప్పుడు రిలీజ్​ అవుతుందనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు.

QR Code: ఈ యాప్స్ ఉంటే... క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం చాలా ఈజీ

మోటో E20 స్పెసిఫికేషన్లు


మోటరోలా మోటో ఈ 20 ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) పై నడుస్తుంది. ఇది 6.5 -అంగుళాల మాక్స్‌విజన్ విజన్ హెచ్‌డి+ డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ యూనిసోక్​ T606 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే.. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరాలను అందించింది. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 5 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను చేర్చింది.

Realme GT Master Edition: రూ.25,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8,999 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

మోటో E20 కనెక్టివిటీ ఆప్షన్స్


ఇది 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్​తో దీని స్టోరేజ్​ను మరింత విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్​/ఏజీపీఎస్​, ఎఫ్ఎమ్​ రేడియో, యూఎస్​బీ టైప్- సీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి చేర్చింది. ఇక, ఫోన్ వెనుక భాగంలో ఫింగర్​ప్రింట్​ సెన్సార్, గూగుల్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడానికి ఒక ప్రత్యేక బటన్‌ను జోడించింది. మోటరోలా మోటో E20 10W ఛార్జింగ్ సపోర్ట్‌ గల 4,000mAh బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 40 గంటల వినియోగాన్ని ఇవ్వగలదు.
Published by:Santhosh Kumar S
First published: