మోటోరోలా నుంచి మడతపెట్టే స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. 'మోటో రేజర్ 2019' పేరుతో ఈ కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది మోటోరోలా. ఈ ఫోన్ గురించి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. కొన్ని లీక్స్ వార్తల్లోకి వచ్చాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సాంసంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇప్పుడు మోటరోలా ఫ్లిప్ ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు సెల్ఫీలు, నోటిఫికేషన్స్, మ్యూజిక్ , గూగుల్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ వాడుకోవడానికి చిన్న డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇందులో సిమ్ కార్డ్ స్లాట్ ఉండదు. ఇసిమ్ ద్వారా నెట్‌వర్క్ సేవలు ఉపయోగించుకోవాలి. అమెరికాలో 2020 జనవరి 9న అందుబాటులోకి రానుంది. 2019 డిసెంబర్ 26న ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. ధర 1,499.99 డాలర్లు. అంటే ఇండియాలో సుమారు రూ.1,07,500 ధర ఉంటుంది. త్వరలో ఇండియాలో ఈ ఫోన్ లాంఛ్ కానుంది. కానీ ధర ఎంత ఉంటుందో తెలియదు.
మోటో రేజర్ 2019 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల ఓలెడ్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 2.7 అంగుళాల సెకండరీ డిస్‌ప్లే
ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 710
రియర్ కెమెరా: 16 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 2510 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: ఇసిమ్
ధర: సుమారు రూ.1,07,500
Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Moto, Motorola, Smartphone, Smartphones