• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • MOTOROLA LAUNCHED MOTO G60 AND MOTO G40 FUSION SMARTPHONES IN INDIA KNOW PRICE AND SPECIFICATIONS SS

Moto G60: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటోరోలా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.13,999 నుంచి

Moto G60: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటోరోలా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.13,999 నుంచి

Moto G60: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటోరోలా నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... ధర రూ.13,999 నుంచి (image: Motorola India)

Moto G60 | మోటోరోలా నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ మార్కెట్లోకి మోటోరోలా తన మార్క్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. మోటో జీ సిరీస్‌లో మరో 2 మోడల్స్‌ని పరిచయం చేసింది. మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. కొన్ని రోజులుగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన లీక్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ అధికారికంగా మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. కొన్ని కొన్ని మార్పులు కూడా ఉన్నాయి. మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బోపవర్ 20 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ రెండు మోడల్స్‌లో 6.8 అంగుళాల హోల్‌పంచ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉండటం విశేషం. మోటో జీ60 స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, మోటో జీ40 ఫ్యూజన్ మోడల్‌లో 64మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

    మోటో జీ60 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999. లాంఛింగ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. ఇక మోటో జీ40 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ.13,999. ఇది 4జీబీ+64జీబీ వేరియంట్ ధర. దీంతో పాటు 6జీబీ+128జీబీ వేరియంట్ కూడా ఉంది. ధర రూ.15,999. లాంఛింగ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మోటో జీ40 ఫ్యూజన్ సేల్ మే 1 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.

    Google Nest Mini: రూ.99 ధరకే గూగుల్ నెస్ట్ మినీ స్మార్ట్ స్పీకర్... వారికి మాత్రమే

    Oppo A54: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ54... ధర ఎంతంటే


    మోటో జీ60 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.8 అంగుళాల హోల్‌పంచ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌
    ర్యామ్: 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ
    రియర్ కెమెరా: 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (టర్బోపవర్ 20 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: డైనమిక్ గ్రే, ఫ్రోస్టెడ్ షాంపైన్
    ధర:
    6జీబీ+128జీబీ- రూ.17,999

    WhatsApp: వాట్సప్ వాడేవాళ్లు అస్సలు ఈ తప్పులు చేయొద్దు

    LG Wing: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 తగ్గింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే


    మోటో జీ40 ఫ్యూజన్ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.8 అంగుళాల హోల్‌పంచ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ
    రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (టర్బోపవర్ 20 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: డైనమిక్ గ్రే, ఫ్రోస్టెడ్ షాంపైన్
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.13,999
    6జీబీ+128జీబీ- రూ.15,999

    మోటోరోలా లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రియల్‌మీ 8, రియల్‌మీ 8 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్‌మీ నోట్ 10 ప్రో లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
    Published by:Santhosh Kumar S
    First published: