• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • MOTOROLA LAUNCHED 4K ANDROID TV STICK IN INDIA SALES FROM THIRD WEEK OF MARCH IN FLIPKART PRICED AT RUPEES 3999 NK

Motorola 4K Android TV Stick: మీ మామూలు టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోండి.. కేవలం రూ. 4 వేలతోనే..

Motorola 4K Android TV Stick: మీ మామూలు టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోండి.. కేవలం రూ. 4 వేలతోనే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటొరోలా స్మార్ట్ టీవీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అతి తక్కువ ఖర్చుతో 4కే హెచ్‌డీఆర్ టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది.

  • Share this:
    ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటొరోలా స్మార్ట్ టీవీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అతి తక్కువ ఖర్చుతో 4కే హెచ్‌డీఆర్ టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది. 4కే ఆండ్రాయిడ్ టీవీ స్టిక్ ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను రూ.3,999గా నిర్ణయించారు. దీని ద్వారా 4కే హెచ్‌డీఆర్ టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ స్టిక్ ఆండ్రాయిడ్ టీవీ 9 Pie ఆపరేటింగ్ సిస్టం ద్వారా పని చేస్తుంది. ఈ స్టిక్ అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్, హెచ్‌డీఆర్ ఫార్మాట్లను సపోర్ట్ చేయనుంది. దీనికి సంబంధించిన అమ్మకాలు ఈ నెల మూడో వారం నుంచి ప్రారంభం అవుతుందని మోటరోలా తెలిపింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5 వంటి యాప్స్ సబ్ స్క్రిప్షన్ కూడా దీని ద్వారా పొందే అవకాశం ఉంటుంది.

    4కే హెచ్‌డీఆర్ వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను ఇందులో అందించారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5 స్ట్రీమింగ్ సర్వీసులను ఇది సపోర్ట్ చేస్తుంది. 2 GB ర్యామ్, 16 GB స్టోరేజ్‌ను ఇందులో అందించారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ కూడా ఉంది.



    బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్‌ను మోటొరోలా 4కే ఆండ్రాయిడ్ టీవీ స్టిక్‌లో అందించారు. రిమోట్‌లో గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కూడా అందించారు. గూగుల్ ప్లే స్టోర్ కు కూడా ఈ స్టిక్ ద్వారా యాక్సెస్ అందించారు. దీంతో గేమ్స్, యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. బ్లూటూత్, వైఫై తదితర కనెక్టవిటీ ఫీచర్లను సైతం ఈ స్టిక్ లో అందించారు. ఇంకెందుకు ఆలస్యం మీ సాధారణ టీవీని కేవలం రూ.3999తో స్మార్ట్ టీవీగా మార్చుకోండి.
    Published by:Krishna Kumar N
    First published: