మోటోరోలా ఇండియా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) రిలీజ్ చేసింది. మోటో ఇ32 (Moto E32) మోడల్‌ను లాంఛ్ చేసింది. రూ.10,000 బడ్జెట్లో ఈ మొబైల్ రిలీజైంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, ఐపీ రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ కూడా ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మోటో ఇ32 కేవలం ఒకే వేరియంట్లో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.10,000 లోపే కొనొచ్చు. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రిలయన్స్ జియో నుంచి రూ.2,549 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో రూ.2,000 క్యాష్‌బ్యాక్, జీ యాన్యువల్ మెంబర్‌షిప్‌పై రూ.549 డిస్కౌంట్ పొందొచ్చు.
మోటో ఇ32 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ టెక్నో స్పార్క్ 9టీ, టెక్నా స్పార్క్ 9, మోటో జీ22 లాంటి మోడల్స్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ మాత్రమే ఉంటాయి. జంక్‌వేర్, బ్లోట్ వేర్ ఉండదు.
43 inches Smart TV: రూ.20 వేలకే 43 అంగుళాల స్మార్ట్ టీవీ... ఆఫర్ ఒక్కరోజు మాత్రమే
Stay ahead with the #motoe32 featuring a fluid 90Hz IPS LCD Display, premium design, a 50MP Quad-Pixel Camera System and unmatched performance with MediaTek Helio G37 & more. Grab yours now ₹10,499 on @flipkart and at leading retail stores.
— Motorola India (@motorolaindia) October 7, 2022
మోటో ఇ32 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది 4జీ స్మార్ట్‌ఫోన్. 4జీ ఎల్టీఈ, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
మోటో ఇ32 స్మార్ట్‌ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది.
8GB Mobile: రూ.11,999 ధరకే 8GB+128GB స్మార్ట్‌ఫోన్... అమెజాన్‌లో ఆఫర్
రూ.10,000 బడ్జెట్లో ఉన్న స్మార్ట్ఫోన్లకు మోటో ఇ32 గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ బడ్జెట్లో రియల్మీ సీ33, ఇన్ఫీనిక్స్ నోట్ 12, మోటో ఇ40, లావా బ్లేజ్, రెడ్మీ 10ఏ లాంటి మోడల్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Motorola, Smartphone