హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Motorola e22s: రూ.10,000 లోపే మోటోరోలా ఇ22ఎస్ రిలీజ్... 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్

Motorola e22s: రూ.10,000 లోపే మోటోరోలా ఇ22ఎస్ రిలీజ్... 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్

Motorola e22s: రూ.10,000 లోపే మోటోరోలా ఇ22ఎస్ రిలీజ్... 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్
(image: Motorola)

Motorola e22s: రూ.10,000 లోపే మోటోరోలా ఇ22ఎస్ రిలీజ్... 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్ (image: Motorola)

Motorola e22s | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ.10,000 లోపు బడ్జెట్‌లో మోటోరోలా ఇ22ఎస్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రూ.10,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ (Smartphone Under Rs 10000) కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మోటోరోలా ఇండియా భారతదేశంలో మరో కొత్త మొబైల్‌ను లాంఛ్ చేసింది. రూ.10,000 లోపు సెగ్మెంట్లో మోటోరోలా ఇ22ఎస్ (Motorola e22s) మోడల్ లాంఛ్ చేసింది. డ్యూయెల్ కెమెరా సెటప్, 90Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ లాంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇటీవల రూ.10,000 బడ్జెట్‌లో మోటో ఇ32, మోటో ఇ32ఎస్ మోడల్స్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకాస్త తక్కువ ధరకు మోటోరోలా ఇ22ఎస్ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. అక్టోబర్ 22న సేల్ ప్రారంభం అవుతుంది.

మోటోరోలా ఇ22ఎస్ ఫీచర్స్

మోటోరోలా ఇ22ఎస్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో కొనొచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్‌తో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ లభిస్తుంది. మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ మోటో ఇ32, టెక్నో స్పార్క్ 9టీ, టెక్నో స్పార్క్ 9, మోటో జీ22 లాంటి మొబైల్స్‌లో ఉంది.

iPhone Offers: ఈ దీపావళికి రూ.50 వేల లోపే ఐఫోన్ కొనేయండి

మోటోరోలా ఇ22ఎస్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప బ్లోట్‌వేర్, జంక్‌వేర్ ఉండదు.

మోటోరోలా ఇ22ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తోంది. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ కూడా ఉంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, యాంబియెంట్ లైట్, యాక్సెలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉన్నాయి. కెమెరాలో ఫోటో, పనోరమా, నైట్ విజన్, ప్రోమోడ్, డ్యూయెల్ క్యాప్చర్ ఫోటో, లైవ్ ఫిల్టర్, ఫేస్ బ్యూటీ, గూగుల్ లెన్స్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్నాయి.

Diwali Shopping: దీపావళి షాపింగ్‌లో ఈ స్పెషల్ ఆఫర్స్ మర్చిపోవద్దు

ఇక ఇటీవల రిలీజైన మోటో ఇ32 ధర రూ.10,499. మోటో ఇ32 మొబైల్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

First published:

Tags: Motorola, Smartphone

ఉత్తమ కథలు