Home /News /technology /

MOTOROLA HAS JUST LAUNCHED THE MOTO G82 5G IN EUROPE AND HAS CONFIRMED THAT IT WILL BE LAUNCHING IN INDIA SOON PRV GH

Moto G82: గ్లోబల్ మార్కెట్లో మరో మిడ్‌రేంజ్ మోటరోలా ఫోన్‌ లాంచ్.. త్వరలో ఇండియాలో రిలీజ్ కానున్న మోటో G82

మోటో జీ82 (Photo: Twitter)

మోటో జీ82 (Photo: Twitter)

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం మిడ్ రేంజ్ ఫోన్ల హవా నడుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఇలాంటి ఫోన్లను లాంచ్ చేశాయి. ఈ జాబితాలో ఇప్పుడు మోటరోలా కూడా చేరింది. ఈ కంపెనీ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్  (Smart Phone)మార్కెట్‌లో ప్రస్తుతం మిడ్ రేంజ్ ఫోన్ల హవా నడుస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఇలాంటి ఫోన్లను లాంచ్ చేశాయి. ఈ జాబితాలో ఇప్పుడు మోటరోలా (Motorola) కూడా చేరింది. ఈ కంపెనీ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో (Moto) G82 పేరుతో కొత్త 5G ఫోన్‌ను (Moto G82 5G) విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 27,000 వరకు ఉండవచ్చు. మోటరోలా కంపెనీ మోటో G82 5G ఫోన్‌ను ప్రస్తుతం యూరప్ మార్కెట్‌లోనే విడుదల చేసింది. త్వరలోనే దీన్ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో లాటిన్ అమెరికా, ఆసియా, ఇండియా, మిడిల్ ఈస్ట్‌తో సహా మరికొన్ని మార్కెట్‌లలోనూ సేల్‌కు రానుంది. ఇండియాలో విడుదల చేసే మోడల్‌లో RAM, స్టోరేజీ ఆప్షన్లు ఎక్కువగా ఉండవచ్చు. దీని ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు చూద్దాం.

* మోటో G82 5G స్పెసిఫికేషన్స్

Moto G82 5G ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల OLED స్క్రీన్‌తో రానుంది. ఈ డివైజ్‌ 100 శాతం DCI-P3 గామట్ కవరేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ సెటప్‌లో 118-డిగ్రీల FoVతో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను అందించారు.

ఇది 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ (Internal Storage)తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌గ్రాగన్ 695 SoC చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను మరింత విస్తరించుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ My UX స్కిన్ ద్వారా కస్టమైజ్డ్ Android 12పై రన్ అవుతుంది. 30W టర్బోపవర్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ సపోర్ట్‌తో, 5000mAh బ్యాటరీతో వస్తుంది. రిటైల్ బాక్స్‌లో కంపెనీ డెడికేటెడ్ ఛార్జర్‌ను సైతం అందించింది. ఫోన్ ఇతర ఫీచర్లలో డ్యూయల్ సిమ్ సపోర్ట్ (Dual sim Support), మైక్రో SD కార్డ్ సపోర్ట్, 3.5mm ఆడియో జాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి.

* ఇండియాలో ఫోన్ లాంచింగ్ ఎప్పుడు?

మోటో G82 5G ఫోన్‌ను రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. మోటరోలా (Motorola) ఇటీవల ఎడ్జ్ 30 మోడల్‌ను మన దేశంలో లాంచ్ (launch) చేసింది. అందువల్ల కంపెనీ ఇండియాలో అతి త్వరలో ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశాలు లేవు. ఇందుకు కాస్త సమయం పట్టవచ్చు. మన దేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్‌ను బట్టి ఈ మొత్తం రూ. 29,999 వరకు ఉంటుంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: 5G Smartphone, Moto, New features

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు