Motorola: మోటో ట్యాబ్ 8, స్మార్ట్​టీవీ లాంచింగ్‌కు సిద్ధమవుతోన్న మోటరోలా.. ఫీచర్లు ఎలా ఉంటాయంటే?

image: Motorola India

మోటో 8 ట్యాబ్​తో పాటు కొత్త స్మార్ట్ టీవీని కూడా లాంచ్​ చేయనున్నట్లు సమాచారం. మోటరోలా స్మార్ట్ టీవీ మార్కెట్‌కు కొత్తేమీ కాదు. ఈ క?

  • Share this:
ఒకప్పుడు భారత మార్కెట్​లో హవా చూపిన మోటరోలా క్రమంగా తన వైభవాన్ని కోల్పోయింది. అయితే తాజాగా దేశీయ సంస్థ లెనెవోతో ఒప్పందం చేసుకొని వరుసగా స్మార్ట్​ ఉత్పత్తులను విడుదల చేస్తూ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో మోటో ట్యాబ్​ 8 పేరుతో సరికొత్త ట్యాబ్​ లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. దీని లాంచింగ్​ని కంపెనీ ఇంకా అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ.. అక్టోబర్ 1న లాంచ్​ చేసే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. మోటో 8 ట్యాబ్​తో పాటు కొత్త స్మార్ట్ టీవీని కూడా లాంచ్​ చేయనున్నట్లు సమాచారం. మోటరోలా స్మార్ట్ టీవీ మార్కెట్‌కు కొత్తేమీ కాదు. ఈ కంపెనీ ఇప్పటికే అనేక స్మార్ట్​టీవీ మోడళ్లను భారత మార్కెట్​లో విక్రయిస్తోంది.

Cars Air Bags: చిన్న కార్లలోనూ కనీసం 6 ఎయిర్ బ్యాగ్స్.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు


మోటో ట్యాబ్​ 8 ఫీచర్లు

మోటో ట్యాబ్8 లెనోవా ట్యాబ్ M8 రీబ్రాండెడ్ వెర్షన్​గా వస్తోంది. లెనోవో ట్యాబ్​8 రెండేళ్ల క్రితం భారతదేశంలో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఇది భారత మార్కెట్​లో రూ .13,999 వద్ద అందుబాటులో ఉంది. కాబట్టి, మోటో ట్యాబ్​ 8లోని ఫీచర్లు దాదాపు లెనోవా ట్యాబ్​ ఎం8తో సమానంగా ఉండే అవకాశం ఉంది. ఈ ట్యాబ్ 1920 x 1200 పిక్సల్స్ రిజల్యూషన్‌ గల 8 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది మీడియాటెక్ హెలియో P22T ట్యాబ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 3GB ర్యామ్​, 32GB ఇంటర్నల్ మెమరీని అందించింది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను మరింతగా విస్తరించవచ్చు.

ఇది ఆండ్రాయిడ్​ Pi v9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. లెనోవా ట్యాబ్ ఎం8 మోడల్​ 5100mAH లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల బ్రౌజింగ్ సమయాన్ని అందిస్తుంది. ఇక, కెమెరా విషయానికొస్తే, మోటో ట్యాబ్ 8 వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. సెల్ఫీల కోసం దీని ముందు భాగంలో ప్రత్యేకంగా 5 మెగాపిక్సెల్ కెమెరాను చేర్చింది.

SEBI: ఇక‌పై మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సంస్థ‌ ఉద్యోగులు పెట్టుబ‌డి పెట్టాల్సిందే


5 సైజ్​లలో ఆండ్రాయిడ్​ స్మార్ట్​టీవీ

ఇక, మోటరోలా స్మార్ట్​టీవీ విషయానికి వస్తే.. కొత్త టీవీ సిరీస్​ను లాంచ్​ చేస్తుందా? లేదా పాత లైనప్​నే రిఫ్రెష్​ చేస్తుందా? అనే విషయంపై స్పష్టత లేదు. ఏదేమైనా, ఈ స్మార్ట్​టీవీ మొత్తం 5 సైజ్​లలో అందుబాటులోకి రానుంది. మోటరోలా ఆండ్రాయిడ్​ స్మార్ట్​టీవీలను 32 -అంగుళాలు, 45 -అంగుళాలు, 50 -అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల సైజ్​లలో విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
Published by:Krishna Adithya
First published: