హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Motorola: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటొరోలా కొత్త ఫోన్ లాంచ్..ధర,స్పెసిఫికేషన్లు చూడండి..

Motorola: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటొరోలా కొత్త ఫోన్ లాంచ్..ధర,స్పెసిఫికేషన్లు చూడండి..

Motorola Edge 30 Ultra: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటొరోలా కొత్త ఫోన్ లాంచ్
(image: Motorola India)

Motorola Edge 30 Ultra: అదిరిపోయే ఫీచర్స్‌తో మోటొరోలా కొత్త ఫోన్ లాంచ్ (image: Motorola India)

ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ మోటొరోలా (Motorola) ఇండియాలో నూతన ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అతి త్వరలో ఈ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఆ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? ఉండబోతుందనే విషయాలు ?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ మోటొరోలా (Motorola) ఇండియాలో నూతన ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. అతి త్వరలో ఈ స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఆ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఏంటి? ధర ఎంత? ఉండబోతుందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా ధర ఫిక్స్:

మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా (Motorola Edge 30 Ultra) ధర రూ.59,999 కాగా, ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఇంటర్ స్టెల్లార్ బ్లాక్, స్టార్ లైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.54,999కే వినియోగదారులకు లభించనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ ప్లస్ 6.67 అంగుళాల డిస్ప్లే అందిస్తుంది. ఇక ఈ ఫోన్‌లో తీసే పిక్చర్స్ హై ఎండ్ క్లారిటీతో వస్తాయి. HDR 10 ప్లస్ DCI P3 కలర్ స్పేస్, పీక్ బ్రైట్‌నెస్ ఆప్షన్స్‌ను ఈ ఫోన్ అందిస్తుంది.

స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:

ఈ స్మార్ట్ ఫోన్ హ్యాండ్ సెట్ ఫ్రంట్, బ్యాక్‌ గొరిల్లా గ్లాస్ (Corning Gorilla Glass 5 protection) ప్రొటెక్షన్‌ను‌ పొందింది. ఇందులోని జనరేషన్ వన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ చిప్ (సిస్టమ్ ఆన్ చిప్ SoC) ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్‌తో (LPDDR5 RAM) పెయిర్ అవుతుంది. 1.22 అంగుళాల 200 ఎంపీ శామ్‌సంగ్ సెన్సార్‌ను ఈ ఫోన్ ఆప్టిక్స్‌లో 1.9 అపెర్చర్ లెన్స్‌తో పెయిర్ చేసి ఉంచుతారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ద్వారా 16 పిక్సెల్స్‌ను సింగిల్ అల్ట్రా పిక్సెల్‌గా మార్చి ఫొటోలను అత్యద్భుతంగా ఈ ఫోన్ డెలివరీ చేయగలదు. ఇందులోని మరొక 50 ఎంపీ శాంసంగ్‌ సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. మరొక 12 ఎంపీ సోనీ సెన్సార్.. టెలిఫోన్ లెన్స్ అపెర్చర్‌ పెయిర్ ఉంటుంది. దీంతో పోర్ట్రయిట్ ఫొటో షూట్స్ ఈజీగా చేయొచ్చు. ఇందులోని 6 ఎంపీ సెన్సార్ 2.2 కెమెరా (అపెర్చర్)తో వస్తుంది. ఇది క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ కోసం ఉపయోగపడుతుంది.

ప్రజల డిమాండ్ మేరకు మరో మోడల్:

మోటొరోలా కంపెనీ ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్‌తో పాటు ప్రజల డిమాండ్‌ మేరకు మరో నూతన మోడల్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. మోటొరోలా ప్రకటించిన నూతన స్మార్ట్ ఫోన్ మోడల్ మోటొరోలా ఎడ్జ్ 30 (Motorola Edge 30).. 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. అతి త్వరలో ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. అయితే, ఇండియాలో ఈ మోడల్ లాంచే చేసే తేదీని, మోడల్ ధరను కంపెనీ ప్రకటించలేదు.

Published by:Sultana Shaik
First published:

Tags: New phone, New smart phone, Technolgy

ఉత్తమ కథలు