హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Motorola Edge 30 Neo: త్వరలో మోటొరోలా ఎడ్జ్ 30 నియో స్మార్ట్‌ఫోన్ లాంచ్.. లీక్ అయిన ఫీచర్ల వివరాలు..

Motorola Edge 30 Neo: త్వరలో మోటొరోలా ఎడ్జ్ 30 నియో స్మార్ట్‌ఫోన్ లాంచ్.. లీక్ అయిన ఫీచర్ల వివరాలు..

Motorola Edge 30 Neo

Motorola Edge 30 Neo

Motorola Edge 30 Neo: మోటొరోలా ఎడ్జ్ 30 నియో 6.28-అంగుళాల OLED డిస్‌ప్లేతో రానుంది. ఈ అప్‌కమింగ్ ఫోన్ హోల్-పంచ్ కటౌట్‌తో వస్తుందని లీకైన ఫొటోల ప్రకారం తెలుస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటొరోలా (Motorola) ఇండియా(India)లో అదిరిపోయే ఫోన్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ సెప్టెంబర్‌లో మోటొరోలా ఎడ్జ్ 30 నియో (Motorola Edge 30 Neo) పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. మోటొరోలా మియామీ (Motorola Miami) అనే కోడ్‌నేమ్‌తో ఈ ఫోన్ సెప్టెంబర్ మొదటి వారంలో ఇండియాలో ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. మొదట్లో దీనిని మోటొరోలా ఎడ్జ్ లైట్ (Motorola Edge Lite) అని కూడా పిలుస్తున్నారు. అయితే లాంచ్‌కు ముందే ఈ ఫోన్ ఏయే కలర్ ఆప్షన్స్‌తో వస్తుందో తాజాగా ఓ టిప్‌స్టర్ వెల్లడించారు. ఆ టిప్‌స్టర్ ప్రకారం, ఈ ఫోన్ బ్లాక్ ఒనిక్స్ (Black Onyx), ఐస్ ప్యాలెస్ (Ice Palace), వెరీ పెరి (Very Peri), ఆక్వా ఫోమ్ (Aqua Foam) కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుంది.


* మోటొరోలా డిజైన్, స్పెషఫికేషన్లు
మోటొరోలా ఎడ్జ్ 30 నియో 6.28-అంగుళాల OLED డిస్‌ప్లేతో రానుంది. ఈ అప్‌కమింగ్ ఫోన్ హోల్-పంచ్ కటౌట్‌తో వస్తుందని లీకైన ఫొటోల ప్రకారం తెలుస్తోంది. ఈ పంచ్ హోల్‌లో సెల్ఫీ కెమెరాను అమర్చారు. స్మార్ట్‌ఫోన్ కింది భాగంలో USB టైప్-సి పోర్ట్, మైక్రోఫోన్ హోల్, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే అందించినట్లు తెలుస్తోంది. లీకైన ఫొటోలలో ఫోన్ బ్యాక్‌సైడ్‌లో LED ఫ్లాష్‌లైట్‌, 64MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కూడా కనిపించింది. ఈ డ్యూయల్ కెమెరాలలో 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నట్లు సమాచారం. 64MP ప్రైమరీ కెమెరా OIS టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.స్మార్ట్‌ఫోన్ రైట్ సైడ్‌లో వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్‌ను ఆఫర్ చేశారు. ఈ మొబైల్‌లో గరిష్ఠంగా 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ మిడ్-రేంజ్ మొబైల్ 8GB RAM+256GB స్టోరేజ్ పాటు క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 695 (Qualcomm Snapdragon 695) ప్రాసెసర్‌తో వస్తుంది.


ఇది కూడా చదవండి :  ఐఫోన్‌ లాక్‌డౌన్ మోడ్‌లో ఆన్‌లైన్ బ్రౌజింగ్‌ సురక్షితం కాదా ?.. నిపుణులు ఏమంటున్నారు


120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, 4,020mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో అందించారు. ఇండియాలో మోటొరోలా ఎడ్జ్ లైట్ త్వరలోనే లాంచ్ కానుందని.. దాని ఫీచర్లు ఇవే అని జూన్ నెలలో కొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. అయితే పైన పేర్కొన్న ఫీచర్లు జూన్ నెలలో మోటొరోలా ఎడ్జ్ లైట్ లీకైన ఫీచర్ల వలె ఉన్నాయి.


మరోవైపు మోటొరోలా సంస్థ తన మోటో G32ను రీసెంట్‌గా భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ G-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz 6.5-అంగుళాల FHD డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ ఆఫర్ చేశారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై నడిచే ఈ ఫోన్ మినరల్ గ్రే, శాటిన్ సిల్వర్ కలర్ ఆప్షన్స్‌లో రిలీజ్ అయింది. ఇందులోని 6.5-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌, 33W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌, 5,000mAh బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను ఇందులో అందించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Mobile offers, Motorola, Smartphones, Tech news

ఉత్తమ కథలు