Motorola : లెనోవో సబ్ బ్రాండ్, గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటొరోలా నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. శామ్‌సంగ్, షియోమీ వంటి బ్రాండ్స్‌కు పోటీగా తాజాగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. మోటొరోలా ఎడ్జ్ 30 ప్యూజన్ పేరుతో తీసుకొచ్చిన ఈ హ్యాండ్‌సెట్, పాంటోన్ కలర్ ఆఫ్ ఇయర్- 2023 వివా మెజెంటాలో వచ్చిన ఏకైక డివైజ్‌గా రికార్డ్ సృష్టించింది. 144Hz రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిస్‌ప్లే, 68W ఛార్జింగ్ వంటి ఫీచర్స్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేదాం..
మోటొరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ధర
మోటొరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ రూ.39,999తో లాంచ్ అయింది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు జనవరి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ , మోటొరోలా.ఇన్, ప్రముఖ రిటైల్ స్టోర్స్‌లో ఇది లభించనుంది.
స్పెసిఫికేషన్స్
ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, Ultra HDR10+తో కర్వ్డ్ 6.55-అంగుళాల pOLED డిస్‌ప్లేతో లభిస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 888+ 5G చిప్‌సెట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ప్రాసెసర్ LPDDR5 RAM 8 GB+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్‌తో డిస్‌ప్లే ప్రొటక్షన్ ఉంటుంది. మెజర్‌మెంట్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 175 గ్రాముల బరువు, 7.45 mm మందం ఉంటుంది.
క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP OIS ప్రైమరీ సెన్సార్, 13 MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2 MP డెప్త్ సెన్సార్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా మాడ్యూల్‌లో 32 MP షూటర్‌ను అమర్చారు. కెమెరా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో ఉంటుంది. ఇది 4x బెటర్ లైట్ సెన్సివిటిలో కూడా అద్భుతమైన పిక్చర్‌ను అందిస్తుంది.
5G Smartphones: రియల్‌మీ 10 ప్రో ప్లస్ vs రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్..రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్?
డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్స్
మోటొరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ HDR10 వీడియో రికార్డింగ్, 8K రికార్డింగ్ ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్‌లో డాల్బీ అట్మోస్‌తో కూడిన రెండు పెద్ద స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. 68W TurboPower ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4400mAh బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉంటుంది.
లాంచ్ ఆఫర్స్
Viva Magentia లిమిటెడ్ ఎడిషన్ Motorola Edge 30 Fusion కోసం కంపెనీ లాంచ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఎంపిక చేసిన కార్డులపై కస్టమర్లు రూ.3,500 ఎక్స్‌ట్రా బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా రిలయన్స్ జియో నుంచి రూ.7,699 విలువైన ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Motorola, Smartphone