Motorola Edge 20 Pro: అక్టోబర్ 1న మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో రిలీజ్... ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్​ డేస్​ సేల్​లో అమ్మకాలు

Motorola Edge 20 Pro: అక్టోబర్ 1న మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో రిలీజ్... ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్​ డేస్​ సేల్​లో అమ్మకాలు

Motorola Edge 20 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్స్ రాబోతున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటొరోలా వరుసగా స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ దూసుకుపోతోంది. ఇదే స్పీడ్​లో మోటొరోలా ఎడ్జ్ 20 ప్రోను (Motorola Edge 20 Pro) భారత మార్కెట్​లోకి లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన టీజర్​ ఇమేజ్​ను మంగళవారం మోటొరోలా ట్విట్టర్​ పేజీలో పోస్ట్​ చేసింది. అయితే ఈ స్మార్ట్​ఫోన్​ లాంచింగ్​ తేదీని మాత్రం వెల్లడించలేదు. అక్టోబర్ 1లోపు ఇది లాంచ్​ అయ్యే అవకాశాలున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ-కామర్స్​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన రాబోయే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale) దీన్ని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఫ్లిప్​కార్ట్​లో పేర్కొన్న వివరాల ప్రకారం ఇది అక్టోబర్ 1న లాంచ్ కానుంది. మరోవైపు, మోటొరోలా త్వరలోనే ఎడ్జ్ 20 ప్రోని దేశంలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు మోటొరోలా ఇండియా హెడ్ ప్రశాంత్ మణి ఆగస్టులోనే ధ్రువీకరించారు. దీంతో అక్టోబర్​ 1 లోపు లాంచ్​ అవ్వడం ఖాయంగా చెప్పవచ్చు. కాగా, మోటొరోలా జూలై చివర్లో మోటొరోలా ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 లైట్‌ వేరియంట్లను లాంచ్ చేసింది. వీటికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Poco X3 Pro: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు

మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో ధర


భారత మార్కెట్​లోకి విడుదలకు సిద్దమవుతోన్న మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో ధర అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఇప్పటికే ఈ స్మార్ట్​ఫోన్​ యూరోప్​లో లాంచ్​ అయ్యింది. యూరప్‌లో 12GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ EUR 699.99 (సుమారు రూ. 60,500) వద్ద విడుదలైంది. ఈ ఫోన్ ఇండిగో వెగాన్ లెదర్, మిడ్ నైట్ బ్లూ కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.12,000 తగ్గింపు

మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో స్పెసిఫికేషన్లు


మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో యూరోపియన్ వెర్షన్ 6.7 -అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌, HDR10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ క్వాల్​కామ్​ స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. దీనిలో ట్రిపుల్​ రియర్​ కెమెరా సెటప్​ను అందించింది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ లెన్స్ సెన్సార్‌ కెమెరాలను అందించింది.

సెల్ఫీలు, వీడియో చాటింగ్​​ కోసం దీని ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చింది. దీనిలో 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్​ను అందించింది. ఇది 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: