Home /News /technology /

MOTOROLA EDGE 20 PRO SMARTPHONE LAUNCHED IN INDIA WITH QUALCOMM SNAPDRAGON 870 AND 108 MEGAPIXEL CAMERA SS

Motorola Edge 20 Pro: ఫ్లాగ్‌షిప్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే

Motorola Edge 20 Pro: ఫ్లాగ్‌షిప్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే
(image: Motorola India)

Motorola Edge 20 Pro: ఫ్లాగ్‌షిప్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో వచ్చేసింది... ధర ఎంతంటే (image: Motorola India)

Motorola Edge 20 Pro | మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో (Motorola Edge 20 Pro) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎడ్జ్ 20 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది మోటోరోలా. ఇప్పటికే ఈ సిరీస్‌లో మోటోరోలా ఎడ్జ్ 20 (Motorola Edge 20), మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (Motorola Edge 20 Fusion) మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో (Motorola Edge 20 Pro) మోడల్‌ను రిలీజ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో ఈ మోడల్ రిలీజ్ అయింది. మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో ధర రూ.36,999. కేవలం 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. అక్టోబర్ 3న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 9ఆర్, సాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్‌కు గట్టి పోటీ ఇస్తుంది.

    Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లో రేపటి నుంచి సేల్... రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.14,099 ధరకే కొనండి ఇలా

    మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో ఫీచర్స్


    మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

    కెమెరా ఫీచర్స్


    మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 16 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ మ్యాక్రో విజన్ సెన్సార్ 8 మెగాపిక్సెల్ 5x టెలీఫోటో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

    Mi 11x 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.9,000 డిస్కౌంట్... అమెజాన్‌లో ఆఫర్

    బ్యాటరీ ఎంత


    మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.1 వర్షన్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిడ్‌నైట్ స్కై, ఇరిడీసెంట్ క్లౌడ్ కలర్స్‌లో కొనొచ్చు.

    స్టాక్ ఆండ్రాయిడ్


    మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ తప్ప బ్లోట్ వేర్ ఉండదు. మోటోరోలా యాప్స్ ఉంటాయి. రెండేళ్లు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్, రెండేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Flipkart, Flipkart Big Billion Days, Mobile News, Mobiles, Motorola, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు