భారతీయులు దీపావళి వేడుకలు (Diwali Celebrations) జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ పండుగ సందర్భంగా చాలామంది కొత్త వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్లు వివిధ కంపెనీలు కూడా ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లో స్మార్ట్ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. అయితే ఈ దీపావళికి మీరు బెస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్‌ను (Camera Smartphones) కొనాలని చూస్తుంటే.. తక్కువ ధరకు లభిస్తున్న ఈ బెస్ట్ కమెరా స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేయండి.
పండుగ ఆఫర్లలో ఈ ఫోన్ రూ. 20వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో హై రేంజ్ కెమెరా ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్.. మంచి కెమెరా అవుట్‌ఫుట్ అందిస్తాయి. ఈ ఫోన్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
JioBook: స్మార్ట్‌ఫోన్ ధరకే జియోబుక్ రిలీజ్... అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన ల్యాప్‌టాప్
టెక్ దిగ్గజం గూగుల్ నుంచి వచ్చిన పిక్సెల్ 6a ఫోన్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీంట్లో 12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 114 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో కూడిన 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. వీటి సాయంతో ఫోన్ 4K వీడియోలను 60 fps వరకు, 1080P ఫుటేజీని 240 fps వరకు క్యాప్చర్ చేయగలదు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో దీన్ని రూ. 28,028కి కొనుగోలు చేయవచ్చు. ఈ పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లలో క్వాలిటీ కెమెరాలు ఉన్నాయి. కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ అల్గారిథమ్స్‌తో యూజర్లు క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు.
గెలాక్సీ S22 ఫోన్లో ట్రిపుల్ కెమెరా సెటప్ బెస్ట్ ఇమేజింగ్‌ను అందిస్తుంది. ఈ సెటప్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మంచి క్వాలిటీ పిక్చర్స్ అందిస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 10 మెగాపిక్సెల్ 3X టెలిఫోటో లెన్స్‌తో పాటు పోర్ట్రెయిట్ మోడ్ ఈ ఫోన్లోని మరో ప్రత్యేకత. ఫెస్టివల్ ఆఫర్లలో ఈ ఫోన్‌ను రూ. 60వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
55 inch Smart TV: అదిరిపోయే ఆఫర్... రూ.30 వేల లోపే 55 అంగుళాల 4K స్మార్ట్ టీవీ... 3 రోజులే ఛాన్స్
పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో ఫోన్లలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. పిక్సెల్ 7 ప్రో మోడల్లోని 5X 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 10X స్టిల్స్ క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఈ రెండింట్లోనూ అల్ట్రావైడ్ లెన్స్‌లు ఉన్నాయి. అయితే పిక్సెల్ 7 ప్రో మోడల్లో మ్యాక్రో క్యాపబిలిటీ ఉంటుంది కానీ, పిక్సెల్ 7లో ఇది ఉండదు.
అత్యంత ఖరీదైన లేటెస్ట్ ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లలో హై క్వాలిటీ కెమెరాలు ఉన్నాయి. 4K ProRes వీడియోలు, ProRaw ఫోటోలను క్యాప్చర్ చేసే స్ట్రాంగ్ లెన్స్ వీటిలో ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 3X టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. కంపెనీ ఈ మోడళ్లలో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించింది. వీడియో క్యాప్చరింగ్ అవసరాల కోసం వీటిని కొనుగోలు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Photography, Smartphone