Motorola Edge 20: మోటోరోలా నుంచి మరో మూడు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి... ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి

Motorola Edge 20: మోటోరోలా నుంచి మరో మూడు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి... ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి (image: Motorola)

Motorola Edge 20 Series | మోటోరోలా ఎడ్జ్ 20, మోటోరోలా ఎడ్జ్ 20 లైట్, మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పట్టు కోసం మోటోరోలా మరో మూడు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసింది. మోటోరోలా నుంచి వచ్చే స్మార్ట్‌ఫోన్స్ అన్నీ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్సే. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్స్ తప్ప ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ఏవీ ఉండవు. మోటోరోలాకు చెందిన ఒకట్రెండు యాప్స్ మాత్రమే ఉంటాయి. యూజర్ ఇంటర్‌ఫేస్ కూడా క్లీన్‌గా ఉంటుంది. రెండేళ్ల పాటు ప్రతీ నెలా సెక్యూరిటీ అప్‌డేట్స్, ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఉచితంగా లభిస్తాయి. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ల ప్రత్యేకత ఇదే. మోటోరోలా ఎడ్జ్ 20 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. మోటోరోలా ఎడ్జ్ 20, మోటోరోలా ఎడ్జ్ 20 లైట్, మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో మోడల్స్‌ని పరిచయం చేసింది. మూడు స్మార్ట్‌ఫోన్లలో 108మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. మూడు మొబైల్స్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి.

    మోటోరోలా ఎడ్జ్ 20 స్పెసిఫికేషన్స్ చూస్తే 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 16 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ కెమెరా వివరాలు వెల్లడించలేదు కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. టర్బోపవర్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 8 గంటలు వాడుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.44,100. ఫ్రోస్టెడ్ ఓనిక్స్, ఫ్రోస్టెడ్ పెరల్ కలర్స్‌లో కొనొచ్చు.

    Smartphone: స్మార్ట్‌ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేయడం మర్చిపోవద్దు

    WhatsApp Messages: వాట్సప్‌లో ముఖ్యమైన మెసేజెస్ సేవ్ చేయండి ఇలా

    మోటోరోలా ఎడ్జ్ 20 లైట్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. టర్బోపవర్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 20 లైట్ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.30,900. ఎలక్ట్రిక్ గ్రాఫైట్, లగూన్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.

    Vivo V19: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి

    Airtel Plans: రూ.299 నుంచి ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ తెలుసుకోండి

    మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే అమెజాన్ హెచ్‌డీఆర్ సపోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 16 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. టర్బోపవర్ 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.61,800. ఇండిగో వీగన్ లెదర్, మిడ్‌నైట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.

    ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు యూరప్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియాలో అమ్మకానికి వస్తాయి. అయితే సేల్ ఎప్పుడు మొదలవుతుందన్న స్పష్టత లేదు. ఈ మొబైల్స్ ఇండియాలో అందుబాటులోకి వస్తాయో లేదో ఇంకా తెలియదు.
    Published by:Santhosh Kumar S
    First published: