Home /News /technology /

Moto Tab G70: మోటొరోలా నుంచి సరికొత్త టాబ్లెట్.. భారత్‌లో త్వరలో లాంచ్ కానున్న మోటో ట్యాబ్ G70

Moto Tab G70: మోటొరోలా నుంచి సరికొత్త టాబ్లెట్.. భారత్‌లో త్వరలో లాంచ్ కానున్న మోటో ట్యాబ్ G70

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మోటో ట్యాబ్ జి70, బీఐఎస్ సర్టిఫికేషన్‌ పొందినట్లు తెలిపారు టిప్‌స్టర్ ముకుల్ శర్మ. దీని గురించి ట్విట్టర్‌లో మరిన్ని వివరాలను ఆయన వెల్లడించారు.

భారత్‌లో కొత్త టాబ్లెట్‌ను ఆవిష్కరించాలని భావిస్తోంది మోటొరోలా సంస్థ. ఇటీవల మోటో ట్యాబ్ జీ20 (Moto Tab G20) మోడల్‌ను లాంచ్ చేసిన తర్వాత ప్రీమియం ట్యాబ్‌లపై మోటొరోలా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో త్వరలోనే మన దేశంలో మోటో ట్యాబ్ జీ70 (Moto Tab G70) మోడల్‌ను సంస్థ ​​విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టాబ్లెట్‌ను టెక్ నిపుణులు ఇప్పటికే గూగుల్ ప్లే కన్సోల్‌లో గుర్తించారు. ఇప్పుడు ఈ డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్‌ను కూడా పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న Lenovo Tab P11 Plus బ్రాండెడ్ వెర్షన్‌గా Moto Tab G70ను తీసుకురానున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మోటో ట్యాబ్ జి70, బీఐఎస్ సర్టిఫికేషన్‌ పొందినట్లు తెలిపారు టిప్‌స్టర్ ముకుల్ శర్మ. దీని గురించి ట్విట్టర్‌లో మరిన్ని వివరాలను ఆయన వెల్లడించారు. ఈ టాబ్లెట్ 2000 x 1200 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో WUXGA+ డిస్‌ప్లేతో రానుంది. ఇది మీడియాటెక్ Kompanio SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని మోడల్ నంబర్ MT8183A. మోటో ట్యాబ్ G70 ప్రస్తుతానికి 4GB RAM వేరియంట్‌లో రావచ్చు. అయితే మోటొరోలా మరిన్ని ర్యామ్ వేరియంట్‌లను కూడా లాంచ్ చేయవచ్చు. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఈ ఓఎస్‌ను ఆండ్రాయిడ్‌ 12కి సైతం అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
Samsung Galaxy A03: శామ్‌సంగ్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఐఫోన్‌ 12ను పోలిన కెమెరా మాడ్యుల్‌.. ఇతర ప్రత్యేకతలివే..

Moto Tab G70 మోడల్ రెండు రోజుల క్రితం Geekbench ప్లాట్‌ఫాంలో లిస్టింగ్ అయింది. Mali-G76 GPU, 4GB RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్.. వంటి స్పెసిఫికేషన్లతో ఈ ట్యాబ్‌ను మోటొరోటా అభివృద్ధి చేసింది. ఇది హీలియో G90T ప్రాసెసర్‌తో పనిచేస్తుందని Geekbench లిస్టింగ్ వెల్లడించింది. అయితే మైక్రో SD కార్డ్‌ ద్వారా స్టోరేజీని పొడిగించుకునే ఆప్షన్‌పై స్పష్టత లేదు. మోటో ట్యాబ్ G70 టాబ్లెట్‌లో 7700mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 15 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అధికారికంగా లాంచ్ అయిన తరువాతే ఈ ట్యాబ్ ధర వివరాలు తెలిసే అవకాశం ఉంది. లెనోవో ట్యాబ్ P11 ప్లస్ కూడా మీడియాటెక్ హీలియో G90T ట్యాబ్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో, 2.05GHz వరకు స్పీడ్ ఆప్షన్‌తో వస్తుంది. P11 ప్లస్ ట్యాబ్ 6GB RAMతో వస్తుంది.
Moto G51 5G: అత్యంత చౌకైన 5జీ స్మార్ట్​ఫోన్​.. మోటో జీ 51 ధర ఎంత? లాంచింగ్ ఎప్పుడు?

ఆ మోడల్‌తో రీఎంట్రీ..
మోటో ట్యాబ్ G20 లాంచింగ్‌తో మోటొరోలా మళ్లీ టాబ్లెట్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ టాబ్లెట్‌ను రూ. 9999 ధర వద్ద విడుదల చేసింది. ఇది TDDI టెక్నాలజీతో కూడిన 8 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ హీలియో P22T చిప్‌సెట్‌తో పాటు 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. మోటో ట్యాబ్ G20 ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై రన్ అవుతుంది. మోటో ట్యాబ్ G20, 5 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో వచ్చిన ఈ టాబ్లెట్‌ బెస్ట్ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో ఈ ట్యాబ్ అందుబాటులోకి వచ్చింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Moto

తదుపరి వార్తలు