హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Moto Tab G62 LTE: ఇండియాలో ‘మోటో ట్యాబ్ G62 LTE’ టాబ్లెట్ సేల్స్ ప్రారంభం.. ధర, ఫీచర్లు చెక్ చేయండి

Moto Tab G62 LTE: ఇండియాలో ‘మోటో ట్యాబ్ G62 LTE’ టాబ్లెట్ సేల్స్ ప్రారంభం.. ధర, ఫీచర్లు చెక్ చేయండి

Moto Tab G62 LTE

Moto Tab G62 LTE

Moto Tab G62 LTE: ఈ మల్టీమీడియా-ఫోకస్డ్ టాబ్లెట్ 2K రిజల్యూషన్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌ క్వాడ్-స్పీకర్ సెటప్‌తో వస్తుంది. మోటో ట్యాబ్ G62 డివైజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 4GB RAMతో పనిచేస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

మోటొరోలా (Motorola) కంపెనీ గత వారం ఇండియన్ మార్కెట్లో (Indian Market) మోటో ట్యాబ్ G62 LTE (Tab G62 LTE) పేరుతో ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ (Android Tablet)ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని సేల్స్ తాజాగా ప్రారంభమయ్యాయి. ఈ మల్టీమీడియా-ఫోకస్డ్ టాబ్లెట్ 2K రిజల్యూషన్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌ క్వాడ్-స్పీకర్ సెటప్‌తో వస్తుంది. మోటో ట్యాబ్ G62 డివైజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 4GB RAMతో పనిచేస్తుంది. 7700mAh బ్యాటరీ, 8MP వెనుక కెమెరా, మైక్రో-SD కార్డ్ సపోర్ట్, డెడికేటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్ వంటి ఇతర ఫీచర్లతో కొత్త ట్యాబ్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. భారతదేశంలో మోటో ట్యాబ్ G62 LTE ధర, లాంచ్ ఆఫర్లు, స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్లను పరిశీలిద్దాం.

* లాంచ్ ఆఫర్లు

మోటో ట్యాబ్ G62 LTE టాబ్లెట్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని కొనుగోలుదారులు 3 నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌కు అర్హులు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్‌పై 5% క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

* ధర

మోటో ట్యాబ్ G62 LTE కేవలం 4GB + 64GB కాన్ఫిగరేషన్‌లోనే వస్తుంది. మన దేశంలో దీని ధర రూ. 17,999. మోటో ట్యాబ్ G62 WiFi వేరియంట్ కూడా ఇండియాలో లాంచ్ అయింది. దీని ధర రూ. 15,999. ఇది ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉంది.

* ఫీచర్లు

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ LTE 2K రిజల్యూషన్, 5:3 యాస్పెక్ట్ రేషియో, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 10.61-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, ఇంటిగ్రేటెడ్ అడ్రినో 610 GPUతో రన్ అవుతుంది. ఇది 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో లభిస్తుంది. మైక్రో-SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజీని మరింత విస్తరించుకోవచ్చు. సరికొత్త ట్యాబ్ G62 డివైజ్ 7700mAh బ్యాటరీ యూనిట్, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఇది కూాడా చదవండి :  గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..? త్వరగా ఆ పని చేయండి.. లేదా ఇక అంతే సంగతులు..

ఈ ట్యాబ్‌లో ఆటో ఫోకస్, 118° ఫీల్డ్ ఆఫ్ వ్యూ, f/2.2 ఎపర్చర్‌ను అందించే 8MP రియర్ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP ఫ్రంట్ షూటర్‌ను కూడా అందించారు. టాబ్లెట్ బరువు 465గ్రాములు. దీని కొలతలు 251.2 × 158.8 × 7.45 మిమీ. ఈ డివైజ్‌ 3.5mm ఆడియో జాక్‌తో లభిస్తుంది. డాల్బీ అట్మోస్‌తో కూడిన క్వాడ్-స్పీకర్ సెటప్‌ బెస్ట్ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.

మోటో ట్యాబ్ G62 టాబ్లెట్ ఆండ్రాయిడ్ 12తో రన్ అవుతుంది. ఇది స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్, కిడ్స్ స్పేస్‌ను అందిస్తుంది. TUV సర్టిఫికేట్‌తో వచ్చిన ఈ డివైజ్ స్పెషల్ రీడింగ్ మోడ్‌ను అందిస్తుంది. 4G, డ్యుయల్-బ్యాండ్ WiFi 802.11 a/b/g/n/ac, బ్లూటూత్ 5.1, GPS, టైప్-సి పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Motorola, Smart phones, Tablet, Tech news

ఉత్తమ కథలు