MOTO G9 POWER LAUNCHED IN INDIA WITH 6000MAH HUGE BATTERY AND SNAPDRAGON 662 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS
Moto G9 Power: భారీ బ్యాటరీ, 64MP కెమెరాతో మోటో జీ9 పవర్ రిలీజ్
Moto G9 Power: భారీ బ్యాటరీ, 64MP కెమెరాతో మోటో జీ9 పవర్ రిలీజ్
(image: Motorola India)
Moto G9 Power | రూ.15,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చింది. మోటో జీ9 పవర్ ప్రత్యేకతలు తెలుసుకోండి.
ఇండియన్ మార్కెట్లోకి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది మోటోరోలా. మోటో జీ9 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే ఇండియాలో మోటో జీ9 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో మరో మోడల్‌ను తీసుకొచ్చింది. ఇందులో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 గంటలపాటు ఉపయోగించొచ్చని మోటోరోలా చెబుతోంది. ఇక ఇందులో 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 6.8 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. మోటో జీ9 పవర్ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. ఇతర బ్లోట్ వేర్, యాప్స్ ఉండవు. స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ కోరుకునేవారి కోసం మరో ఆప్షన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటంతో ఫోన్ బరువు కూడా ఎక్కువగానే ఉంది. మోటో జీ9 పవర్ బరువు 221 గ్రాములు. మోటో జీ9 పవర్ 4జీబీ+128జీబీ వేరియంట్లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.11,999. డిసెంబర్ 15న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది.
#motog9power is here! Get ready to unleash your power with a 64 MP triple camera system that allows you to capture beautiful high-res images, professional-looking portraits, & incredibly detailed close-ups. Available at ₹11,999 from 15th Dec on @Flipkart. https://t.co/jreqyJCeHEpic.twitter.com/TzIHZqKKTq
ఇక ఇండియాలో ఇప్పటికే మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రూ.20,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది మోటోరోలా. మోటో జీ 5జీ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.