news18-telugu
Updated: November 30, 2020, 9:40 PM IST
ఫ్రతీకాత్మకచిత్రం
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా ఇటీవల జీ9 పేరుతో బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జి9 ఫోన్ కు కొనసాగింపుగా మోటరోలా తన మోటో జి9 ప్లస్‌ను త్వరలోనే భారత్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. కాగా, సెప్టెంబర్ నెలలో బ్రెజిల్లో అధికారికంగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ధృవీకరణ లభించింది. అందుకు అనుగుణంగానే XT2083–-7, XT2087–-3 మోడల్ నంబర్లతో జి9 ప్లప్ స్మార్ట్ ఫోన్ ను బీఐఎస్ జాబితాలో చేర్చింది. దీంతో అతి త్వరలోనే భారత స్మార్ట్ ఫోన్ ప్రియులను మోటో జి9 ప్లస్ అలరించనుంది. కాగా, దీనికి సంబంధించిన ధృవీకరణను మైస్మార్ట్ ప్రైస్ టెక్ పోర్టల్ గుర్తించింది. అయితే, మోటో జి 9 ప్లస్ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని మాత్రం బీఐఎస్ తన వెబ్ సైట్లో వెల్లడించలేదు. కాగా, మోటో జి9 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ రెండవ వారంలో భారతదేశంలో విడుదల కానుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మోటో జి 9 ప్లస్ స్పెసిఫికేషన్లు..సెప్టెంబర్‌లో బ్రెజిల్లో విడుదలైన మోటో జి 9 ప్లస్ (4 జిబి ర్యామ్,128 జిబి స్టోరేజ్) వేరియంట్ BRL 2,249.10 (సుమారు రూ .31,100) ధరతో ప్రారంభించబడింది. 6.8 -అంగుళాల ఫుల్‌హెచ్‌డి ప్లస్ మాక్స్ విజన్ డిస్ప్లేను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో అట్రాక్టివ్ ఫీచర్లను జోడించింది. ఇది 2.3GHz క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చిప్సెట్ చేత శక్తినిస్తుంది.
అంతేకాక, దీనిలో ఫోటోగ్రఫీ కోసం మోటో జి 9 ప్లస్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ 18 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు ఉన్నాయి. దీని ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కూడా అందించింది.
Published by:
Krishna Adithya
First published:
November 30, 2020, 9:40 PM IST