Home /News /technology /

MOTO G9 LAUNCHED IN INDIA WITH QUALCOMM SNAPDRAGON 662 AND 5000MAH BATTERY KNOW PRICE AND SPECS SS

Moto G9: మోటో జీ9 వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ ఇవే

Moto G9: మోటో జీ9 వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ ఇవే

Moto G9: మోటో జీ9 వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ ఇవే

Moto G9 | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.12,000 లోపేనా? మోటోరోలా నుంచి మోటో జీ9 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది.

    మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మోటో జీ సిరీస్‌లో కొత్తకొత్త ఫోన్లు లాంఛ్ చేస్తున్న మోటోరోలా... ఇప్పుడు మోటో జీ9 మోడల్‌ను పరిచయం చేసింది. మోటో జీ8 అప్‌గ్రేడ్ వర్షన్ ఇది. మోటో జీ9 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ+64జీబీ వేరియంట్‌లో మాత్రమే మోటో జీ9 రిలీజైంది. ధర రూ.11,499 మాత్రమే. ఇండియాలో రెడ్‌మీ నోట్ 9 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎం21, రియల్‌మీ 6ఐ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది మోటో జీ9. ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 31 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.


    మోటో జీ9 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+ మ్యాక్స్ విజన్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే
    ర్యామ్: 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
    రియర్ కెమెరా: 48+2+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ నానో సిమ్
    కలర్స్: ఫారెస్ట్ గ్రీన్, సాఫైర్ బ్లూ
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.11,499
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Android 10, Moto, Motorola, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు