మోటోరోలా ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. రూ.20,000 బడ్జెట్‌లో మోటో జీ82 5జీ (Moto G82 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ (Snapdragon 695 Processor), అమొలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.21,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, ఇతర రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. రిలయన్స్ జియో యూజర్లకు రూ.5,049 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. మోటో జీ82 5జీ మొబైల్ సేల్ జూన్ 14న ప్రారంభం అవుతుంది. మిటియోరైట్ గ్రే, వైట్ లిల్లీ కలర్స్‌లో కొనొచ్చు.
మోటో జీ82 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, పోకో ఎక్స్4 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది. మోటో జీ82 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
The wait’s over!#motog82 5G with amazing #BillionColours 120Hz 10-bit pOLED display, India's first* 50MP OIS Cam & more is available at just starting ₹19,999* (incl. bank offer). Sale starts 14 June on @Flipkart @RelianceDigital & leading retail stores. Go for a #BillionColours
— Motorola India (@motorolaindia) June 7, 2022
మోటో జీ82 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
మోటో జీ82 5జీ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ విషయానికి వస్తే 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం జాక్, డాల్బీ ఆట్మాస్ సపోర్ట్, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మోటోరోలా స్మార్ట్‌ఫోన్స్ అన్నీ స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయి. ఇందులో ఆండ్రాయిడ్ యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్, యాడ్స్ ఉండవు. మోటోరోలా యాప్స్, ఇతర మోటో ఫీచర్స్ లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Motorola, Smartphone