మోటరోలా మొబైల్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్స్ కంపెనీ లెనోవో కింద మోటరోలా స్మార్ట్‌ఫోన్స్ తయారు చేస్తోంది. తక్కువ ధరకు బెస్ట్ ఫీచర్స్ అందిస్తూ అన్ని దేశాల మొబైల్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటోంది. ప్రస్తుతం త్వరలో యూరప్‌లో మోటో G73, మోటో G53 పేరుతో రెండు కొత్త మోడల్స్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కంపెనీ Moto G సిరీస్‌లో నాలుగు ఫోన్‌లు, E సిరీస్‌లో కూడా ఓ కొత్త డివైజ్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. యూరప్ తర్వాత లాటిన్ అమెరికా, ఆసియాలో అందుబాటులోకి వస్తాయి. సిరీస్‌లోని ముందున్న మోడల్స్ కంటే వీటిలో చాలా అప్‌గ్రేడ్స్‌ను కంపెనీ అందిస్తోంది. కొత్తగా రానున్న Moto G73, G53 మోడల్స్ ఫీచర్లు ఎలా ఉండనున్నాయో చూద్దాం.
Moto G73
మోటరోలా మోటో G73 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ చిప్‌సెట్ దాని CPUని డైమెన్సిటీ 920 కంటే తక్కువ క్లాక్స్ వద్ద రన్ చేస్తుంది. GPU భిన్నంగా ఉంటుంది(మాలి కాకుండా ఇమాజినేషన్ డిజైన్). అయినప్పటికీ ఈ చిప్ 5G సబ్-6GHz మోడెమ్‌ను తెస్తుంది, ఇది Moto G72 (ఇందులో Helio G99 చిప్‌సెట్) కంటే పెద్ద అప్‌గ్రేడ్. ఈ ఫోన్ మైల్డ్ My UX మార్పులతో ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓఎస్‌తో రన్ అవుతుంది. ప్రస్తుతం 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మాత్రమే ఉంది.
మోటరోలా గత సంవత్సరం మోడల్ P-OLED డిస్‌ప్లేను 6.5" IPS LCDతో రీప్లేస్ చేసింది. ఇది 120Hz వద్ద రన్ అవుతుంది, 1,080 x 2,400px రిజల్యూషన్‌తో (20:9) వస్తుంది. మునుపటిలాగే డిస్‌ప్లేలో పంచ్ హోల్ డిజైన్‌లో 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనుక వైపు 108MP కెమెరా స్థానంలో 50MP సెన్సార్ చాలా పెద్ద 1.0µm పిక్సెల్స్‌తో (4-in-1 బిన్నింగ్‌తో 2.0µm) ఉంది. ఓల్డ్ సెన్సార్ పిక్సెల్స్ వీలైనంత చిన్నవిగా 0.64µm (1.28µm బిన్నింగ్‌తో) ఉన్నాయి. 4K వీడియో క్యాప్చర్ కోసం సపోర్ట్ చేసే అప్‌గ్రేడ్ పొందే అవకాశం ఉంది. ఫోన్ వెనుకవైపు ఇతర మాడ్యూల్ 118° ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఆటో ఫోకస్‌తో 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. ఇది మాక్రో ఫోటోలను కూడా క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది.
Moto G73 5,000mAh బ్యాటరీ, TurboPower 30, 30W ఛార్జర్(బాక్స్‌లో అందిస్తారు)తో వస్తుంది. USB-C 2.0 పోర్ట్ ద్వారా ఛార్జింగ్ అవుతుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంటుంది. డాల్బీ అట్మాస్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. G73 హైబ్రిడ్ స్లాట్‌తో కూడిన డ్యూయల్ సిమ్ ఫోన్, అంటే సాధారణంగా రెండో SIM కార్డ్ ఉండే చోట మైక్రో SD స్లాట్‌ని పొందవచ్చు. అదనంగా Wi-Fi 5 (ac), బ్లూటూత్ 5.3, NFC సాధారణంగా ఉంటే స్థానాల్లోనే ఉంటాయి. ఫోన్ బాడీ ప్లాస్టిక్‌తో తయారు చేశారు, వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో రూపొందించారు. ఇది 8.3mm మందం, 181g బరువు ఉంటుంది. Moto G73 ఒకే కాన్ఫిగరేషన్‌లో (8/256GB) €300(దాదాపు రూ.26,596)కి అందుబాటులో ఉంటుంది.
Moto G53
మోటో G53 ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. ఈసారి ఇది స్నాప్‌డ్రాగన్ 480+ (స్నాప్‌డ్రాగన్ 680 స్థానంలో ఉంది)తో వస్తుంది. ఫోన్ 4, 6 లేదా 8GB RAM, 64 లేదా 128GB ఇంటర్నల్ స్టోరేజ్(ఎక్స్‌పాండబుల్) వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
డిస్‌ప్లే G52లో లాగా లేదు. ఇది 6.5 అంగుళాల LCD స్క్రీన్‌తో వస్తుంది. దీనికి 720 x 1,600px రిజల్యూషన్ (20:9) ఉంటుంది. Moto G52 6.6 అంగుళాల 1080p డిస్‌ప్లే (90Hz AMOLED)ని కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా 8MPకి తగ్గింది. వెనుకవైపు ప్రైమరీ 50MP కెమెరా 0.64µm పిక్సెల్స్‌తో (బిన్నింగ్‌తో 1.28µm) చిన్న సెన్సార్‌ని ఉపయోగిస్తుంది. కెమెరా 1080p వీడియో క్యాప్చరింగ్‌కు (కేవలం 30fps వద్ద, G73 లాగా 60fps కాదు) సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా వైడ్ కెమెరాకు బదులుగా ప్లెయిన్ 2MP మాక్రో క్యామ్ ఉంది.
Moto G53 కేవలం 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. G53, G73 రెండింట్లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌లు ఉన్నాయి (అదనంగా ఫేస్ అన్‌లాక్). ఈ సిరీస్‌లో వీటి ముందున్న మోడల్స్ మాదిరిగానే ఈ ఫోన్సలో వాటర్-రిపల్లెంట్ డిజైన్‌తో ప్లాస్టిక్ షెల్ ఉంది. USB-C 2.0 పోర్ట్, దిగువన 3.5mm జాక్ ఉంటుంది. డాల్బీ అట్మోస్‌తో కూడిన స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇది హైబ్రిడ్ స్లాట్‌తో కూడిన డ్యూయల్-సిమ్ ఫోన్. రెండో సిమ్ స్థానంలో మైక్రో SD కార్డ్ స్లాట్ వస్తుంది. మోటో G53ని €250(దాదాపు రూ.22,163)కి సొంతం చేసుకోవచ్చు. ఈ వేరియంట్ 4/128GB మెమరీతో వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Moto, Motorola