హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Moto G72: మోటో జీ72 వచ్చేసింది... కొత్త ప్రాసెసర్, 180MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

Moto G72: మోటో జీ72 వచ్చేసింది... కొత్త ప్రాసెసర్, 180MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

Moto G72: మోటో జీ72 వచ్చేసింది... కొత్త ప్రాసెసర్, 180MP కెమెరా, మరెన్నో ఫీచర్స్
(image: Motorola India)

Moto G72: మోటో జీ72 వచ్చేసింది... కొత్త ప్రాసెసర్, 180MP కెమెరా, మరెన్నో ఫీచర్స్ (image: Motorola India)

Moto G72 | మోటోరోలా ఇండియా నుంచి రూ.20,000 లోపు మరో స్మార్ట్‌ఫోన్ (Smartphone Under Rs 20000) రిలీజైంది. మోటో జీ సిరీస్‌లో మోటో జీ72 లాంఛ్ అయింది. ఇందులో లేటెస్ట్ ప్రాసెసర్, 108MP కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మోటోరోలా ఇండియా జీ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసింది. జీ సిరీస్‌లో ఇప్పటికే మోటో జీ22, మోటో జీ32, మోటో జీ32, మోటో జీ52, మోటో జీ62, మోటో జీ82 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటో జీ72 (Moto G72) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. రూ.20,000 బడ్జెట్‌లో ఈ మొబైల్‌ని లాంఛ్ చేసింది మోటోరోలా ఇండియా. ఆఫర్స్‌తో కలిపి రూ.15,000 లోపే ఈ మొబైల్ కొనొచ్చు. ఇందులో లేటెస్ట్‌గా రిలీజైన మీడియాటెక్ హీలియో జీ99 (MediaTek Helio G99) ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సపోర్ట్, 180MP కెమెరా, ఓలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 4జీ స్మార్ట్‌ఫోన్. కేవలం 4జీ మొబైల్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

మోటో జీ72 ధర, ఆఫర్స్

మోటో జీ72 స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌తో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999. అక్టోబర్ 12 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది.  ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. పోలార్ బ్లూ, మెటియోరైట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు. ఆఫర్స్‌తో కేవలం 14,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో రూ.3,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే.

OnePlus Nord Watch: ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ వాచ్ రిలీజ్... ధర, ఫీచర్స్ తెలుసుకోండి

మోటో జీ72 స్పెసిఫికేషన్స్

మోటో జీ72 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల pOLED డిస్‌ప్లే ఉంది. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఇటీవల రిలీజైన ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ, పోకో ఎం5, ఇన్ఫీనిక్స్ నోట్ 12 ప్రో లాంటి మోడల్స్‌లో ఉంది. మోటో జీ72 ఆండ్రాయిడ్ 12 + మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప ఇతర జంక్‌వేర్, ‌బ్లోట్‌వేర్ ఉండదు.

WhatsApp Call links: వాట్సప్‌లో కాల్ లింక్స్ ఫీచర్... మీరూ ఇలా వాడుకోండి

మోటో జీ72 కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 108మెగాపిక్సెల్ + 8మెగాపిక్సెల్ హైబ్రిడ్ అల్‌ట్రా వైడ్ యాంగిల్, డెప్త్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 30వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Flipkart Big Billion Days, Moto, Motorola, Smartphone

ఉత్తమ కథలు