హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Moto G72: సర్‌ప్రైజ్.. తక్కువ ధరలో 108 ఎంపీ కెమెరా ఫోన్ లాంచ్! ఫీచర్లు అదుర్స్

Moto G72: సర్‌ప్రైజ్.. తక్కువ ధరలో 108 ఎంపీ కెమెరా ఫోన్ లాంచ్! ఫీచర్లు అదుర్స్

సర్‌ప్రైజ్.. తక్కువ ధరతో మార్కెట్‌లోకి కొత్త 108 ఎంపీ కెమెరా ఫోన్! ఫీచర్లు అదుర్స్

సర్‌ప్రైజ్.. తక్కువ ధరతో మార్కెట్‌లోకి కొత్త 108 ఎంపీ కెమెరా ఫోన్! ఫీచర్లు అదుర్స్

Motorola | కొత్తగా ఫోన్ కొనే వారి కోసం మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో కంపనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ధర కూడా అందుబాటులో ఉంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Moto G72 Price | మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. బడ్జెట్‌ ధరలోనే మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ (Smartphone) అందుబాటులోకి వచ్చింది. మోటరోలా (Motorola) తాజాగా మోటో జీ72 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. అందుబాటు ధరలో అదిరే ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం.

  మోటరోలా మోటో జీ72 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ జీ 99 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 6 జీబీ ర్యామ్, 6.6 అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్‌లో చెప్పుకోదగ్గ మరో ఫీచర్ 108 ఎంపీ కెమెరా. ఫోన్ వెనుక భాగంలో 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ (108 + 8+ 2) ఉంటుంది. ఇంకా ఫోన్ ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను కంపెనీ అమర్చింది.

  ఇప్పుడు కొనండి.. వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ కట్టండి! కంపెనీ అదిరే ఆఫర్!

  మోటో జీ72 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్‌లో బ్యాటరీ కూడా ఎక్కువే ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. అలాగే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది. 30 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ ఉందని కంపెనీ పేర్కొంటోంది. ఈ ఫోన్ రేటును గమనిస్తే.. రూ. 18,999గా ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ తొలి సేల్ దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది.

  ఇది మామూలు వాయింపు కాదు భయ్యా.. ఏకంగా రూ.170 పెరిగిన సిలిండర్ ధర.. ఏడాదిలో 5 సార్లు పెంపు

  అయితే ఈ ఫోన్‌పై కంపెనీ పలు ఆఫర్లు అందిస్తోంది. రూ. 14,999కే కొనుగోలు చేయొచ్చు. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ. 3 వేలు, ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కింద రూ.1000 తగ్గింపు పొందొచ్చు. ఇంకా ఈ ఫోన్‌లో బయోమెట్రిక్ అథంటికేషన్ కోసం అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమెటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, జీపీఎస్, బ్లూటూత్ 5.1, 4జీ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సూపర్ డీల్ అని చెప్పుకోవచ్చు. 108 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు అన్నీ ఇందులో ఉన్నాయి. అలాగే డిస్‌ప్లే కూడా అదిరింది. అందుకే ఈ ఫోన్‌ను ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Budget smart phone, Moto, Motorola, New smartphone, Smartphones

  ఉత్తమ కథలు