MOTO G71S ANOTHER NEW PHONE LAUNCH FROM MOTOROLA MOTO G71S PRICE SPECIFICATIONS DETAILS HERE GH VB
Moto G71s: మోటొరోలా నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్.. మోటో G71s ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..
ప్రతీకాత్మక చిత్రం
మోటొరోలా (Motorola) కంపెనీ రూ.20 వేలలోపు ధరలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ71ఎస్ (Moto G71s) పేరుతో ఇది చైనా మార్కెట్లోకి రిలీజ్ అయింది. ప్రస్తుతం ఉన్న Moto G71 మోడల్‌కు తాజా ఫోన్ రిఫ్రెష్ వెర్షన్‌గా వచ్చింది.
ఇండియాలో టాప్ మొబైల్ బ్రాండ్స్(Top Mobile Brands) అన్నీ బడ్జెట్(Budget), మిడ్‌రేంజ్ ఫోన్ల మార్కెట్‌పై(Market) దృష్టిపెట్టాయి. ప్రతి కంపెనీ(Company) నుంచి వేర్వేరు సెగ్మెంట్లకు చెందిన ఫోన్లు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మోటొరోలా (Motorola) కంపెనీ రూ.20 వేలలోపు ధరలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ71ఎస్ (Moto G71s) పేరుతో ఇది చైనా మార్కెట్లోకి రిలీజ్ అయింది. ప్రస్తుతం ఉన్న Moto G71 మోడల్‌కు తాజా ఫోన్ రిఫ్రెష్ వెర్షన్‌గా వచ్చింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌ల పరంగా దాదాపు పాత తరం మోడల్‌ను పోలి ఉంటుంది. కానీ కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి. మోటో(Moto) G71s ఫోన్ ఇప్పుడు 6.4-అంగుళాల డిస్‌ప్లేకు బదులుగా 6.6-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. స్మూత్ స్క్రోలింగ్, వీడియో ఎక్స్‌పీరియన్స్(Video Experience) కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. రిజల్యూషన్ కూడా ఫుల్-HD+ మాదిరిగానే ఉంటుంది.
అయితే బ్యాటరీ, కెమెరా స్పెసిఫికేషన్‌లను కంపెనీ మార్చలేదు. ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. దీని గ్లోబల్ లాంచ్ వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి.
* ధర ఎంత?మోటో G71s ఫోన్ సింగిల్ 8GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌లోనే లభిస్తుంది. దీని ధర CNY 1,699 (దాదాపు రూ. 19,500) వరకు ఉంది. ఈ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ చేస్తారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ ఇండియాలో మాత్రం ఈ ఫోన్‌ను ప్రస్తుతం రిలీజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే కంపెనీ ఇప్పటికే మోటో జి52, మోటో ఎడ్జ్ 30 డివైజ్లను ఇండియాలో చాలా కాలం క్రితం ఆవిష్కరించింది.
వీటిని మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మోటో G71s కంటే టాప్ రేంజ్ ఫోన్‌గా కనిపించే మోటో G82ను కంపెనీ త్వరలో భారతదేశంలో లాంచ్ చేయవచ్చు. పాత తరం మోటో G71 5G ఫోన్ ధర ఇండియాలో రూ.18,999గా ఉంది. * మోటో G71S స్పెసిఫికేషన్‌లుమోటో G71s ఫోన్ 8GB RAMతో, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 11కి బదులుగా ఆండ్రాయిడ్ 12తో లాంచ్ అవుతుంది.
33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే అదే 5,000mAh బ్యాటరీ ఉంది. రియర్ కెమెరా మాడ్యూల్‌లో 4-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, వెనుకవైపు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, ముందు భాగంలో హోల్-పంచ్ కటౌట్ లోపల 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ డ్యూయల్-వీడియో మోడ్, నైట్ మోడ్, 50-మెగాపిక్సెల్ మోడ్, ఇతర ఫిల్టర్‌లతో లభిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.