Moto G7 Power: బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్... మోటో జీ7 పవర్ ధర రూ.13,999

Moto G7 Power | 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌కు 15W టర్బోపవర్ సపోర్ట్ ఉంది. ఫింగర్‍‌ప్రింట్ స్కానర్, మైక్రో యూఎస్‌బీ టైప్-సీ సపోర్ట్ లాంటి ఫీచర్లున్నాయి.

news18-telugu
Updated: February 18, 2019, 9:39 AM IST
Moto G7 Power: బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్... మోటో జీ7 పవర్ ధర రూ.13,999
Moto G7 Power: భారీ బ్యాటరీతో మోటోరోలా జీ7 పవర్
news18-telugu
Updated: February 18, 2019, 9:39 AM IST
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ అంటే భారీ బ్యాటరీనే గుర్తొస్తుంది. ఏ ఫోన్ అయినా భారీ బ్యాటరీతో రిలీజ్ చేయడం మోటోరోలాకు అలవాటు. ఇప్పుడు మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన మోటోరోలా అదే ట్రెండ్ ఫాలో అయింది. భారీ బ్యాటరీతో మోటో జీ7 పవర్ లాంఛ్ చేసింది మోటోరోలా. ఈ సిరీస్‌లో మోటో జీ7, మోటో జీ7 ప్లస్, మోటో జీ7 ప్లే, మోటో జీ7 పవర్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో మోటో జీ7 పవర్ రిలీజ్ చేసింది ఆ కంపెనీ. మొదటిసారిగా ఇండియాలో ఆఫ్‌లైన్ స్టోర్లల్లో కూడా ఈ ఫోన్ అమ్మకానికి ఉంటుంది. లేదా Motorola.in వెబ్‌సైట్‌లో మోటో స్టోర్ లేదా మోటో హబ్, సిటీ, స్టేట్ ఎంచుకొని ఈ ఫోన్ కొనొచ్చు. త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌కు 15W టర్బోపవర్ సపోర్ట్ ఉంది. ఫింగర్‍‌ప్రింట్ స్కానర్, మైక్రో యూఎస్‌బీ టైప్-సీ సపోర్ట్ లాంటి ఫీచర్లున్నాయి.

Read this: Bharat Ke Veer app: వీరజవాన్ల కుటుంబాలను మీరూ ఆదుకోవచ్చు ఇలా...

moto g7 power, g7 power specs, moto g7 power features, moto g7 power specifications, moto g7 power camera, moto g7 power release, moto g7 power price, moto g7 power launching, moto g7 power in india, మోటోరోలా జీ7 పవర్, మోటోరోలా జీ7 పవర్ ఫీచర్స్, మోటోరోలా జీ7 పవర్ స్పెసిఫికేషన్స్, మోటోరోలా జీ7 పవర్ ధర, మోటోరోలా జీ7 పవర్ రిలీజ్, మోటోరోలా జీ7 పవర్ లాంఛింగ్

మోటోరోలా జీ7 పవర్ స్పెసిఫికేషన్స్


డిస్‌ప్లే: 6.24 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 632
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్
ధర: రూ.13,999

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు

ఇవి కూడా చదవండి:

ఎల్ఐసీ నుంచి మీకు రావాల్సిన డబ్బులు బ్లాక్ అయ్యాయా? కారణాలు ఇవే...

Amazon, Google, Audi... ఈ లోగో వెనుక సీక్రెట్ మీనింగ్ ఏంటో తెలుసా?
First published: February 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...