Home /News /technology /

MOTO G62 5G SMARTPHONE LAUNCHED IN INDIA WITH SNAPDRAGON 695 PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Moto G62 5G: మోటోరోలా నుంచి కొత్త ఫోన్ రిలీజ్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే

Moto G62 5G: మోటోరోలా నుంచి కొత్త ఫోన్ రిలీజ్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే
(image: Motorola India)

Moto G62 5G: మోటోరోలా నుంచి కొత్త ఫోన్ రిలీజ్... స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే (image: Motorola India)

Moto G62 5G | స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది మోటోరోలా. ఇప్పటికే ఈ బడ్జెట్‌లో ఉన్న మొబైల్స్‌కు మోటో జీ62 పోటీ ఇవ్వనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
మోటోరోలా ఇండియా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వరుసగా కొత్త మొబైల్స్ రిలీజ్ చేస్తూనే ఉంది. జీ సిరీస్‌లో ఇప్పటికే మోటో జీ32, మోటో జీ42, మోటో జీ82 (Moto G82) మోడల్స్ రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్‌గా మోటో జీ62 5జీ (Moto G62 5G) మోడల్ రిలీజ్ చేసింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే, 5,000ఎంఏహె బ్యాటరీ లాంటి ప్రరత్యేకతలు ఉన్నాయి. రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. మోటో జీ62 5జీ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999.

మోటో జీ62 5జీ సేల్


మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ఆగస్ట్ 19 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపైనా ఆఫర్స్ ఉన్నాయి.

Rakhi Gift Ideas: మీ సోదరికి రూ.2,000 లోపు అదిరిపోయే రాఖీ గిఫ్ట్స్


మోటో జీ62 5జీ స్పెసిఫికేషన్స్


మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పోకో ఎక్స్4 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 స్మార్ట్‌ఫోన్లలో ఉంది.

మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ మాత్రమే ఉంటాయి. ఇతర బ్లోట్‌వేర్, జంక్ వేర్ ఉండదు. ఒక ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. మోటో జీ62 5జీ మొబైల్‌కి ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ లభించనుంది. థింక్ షీల్డ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది.

WhatsApp: మరో కొత్త ఫీచర్... మీ వాట్సప్ నెంబర్ కనిపించకుండా హైడ్ చేయొచ్చు

మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ డెప్త్ సెన్సార్‌గా కూడా పనిచేస్తుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.



మోటో జీ62 5జీ మొబైల్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ స్పీకర్స్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మిడ్‌నైట్ గ్రే, ఫ్రాస్టెడ్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Motorola, Smartphone

తదుపరి వార్తలు