Moto G60s: అదిరిపోయే ఫీచర్లతో మోటో జీ60ఎస్ స్మార్ట్​ఫోన్​​ రిలీజ్

Moto G60s: అదిరిపోయే ఫీచర్లతో మోటో జీ60ఎస్ స్మార్ట్​ఫోన్​​ రిలీజ్

Moto G60s | మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. మోటో జీ60ఎస్ మొబైల్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ మోటరోలా వరుసగా స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ తాజాగా మోటో G60s స్మార్ట్‌ఫోన్‌ను బ్రెజిల్​ మార్కెట్​లో అధికారికంగా ఆవిష్కరించింది. ఏప్రిల్‌లో భారత మార్కెట్​లోకి వచ్చిన మోటో G60 తో పోలిస్తే దీనిలో అనేక కొత్త అప్​డేట్స్​ను చేర్చింది. మోటో G60s విభిన్న చిప్‌సెట్, వేగవంతమైన 50W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలో క్వాడ్-కెమెరా సెటప్‌ను అందించడం విశేషం. ప్రస్తుతానికి బ్రెజిల్​ మార్కెట్​లో విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్​ను భారత్​లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. మోటో G60s మొత్తం గ్రీన్, బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బ్రెజిల్ మార్కెట్లో ఇది BRL 2,499 (రూ. 35,500) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

Google: మీ గూగుల్ అకౌంట్ ఎంతవరకు సేఫ్? ఈ సెట్టింగ్స్ మార్చండి

WhatsApp Web: వాట్సప్ వెబ్‌లో కొత్త ఫీచర్... ఫోటోలు ఎడిట్ చేయొచ్చు

మోటో జీ60ఎస్ స్పెసిఫికేషన్లు


మోటో జీ60ఎస్ స్మార్ట్​ఫోన్ 6.8 అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్​ కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ హీలియో G95 SoC, మాలి- G76 MC4 GPU ప్రాసెసర్​తో పని చేస్తుంది. దీనిలో 6 జీబీ ర్యామ్​, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించారు. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇది క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని వెనుకవైపు 64MP ప్రైమరీ మెయిన్​ కెమెరా ఉంటుంది. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మాక్రో సెన్సార్ కెమెరా, 2MP డెప్త్ కెమెరాను అందించింది. దీని ముందు భాగంలో సెల్ఫీ కోసం ప్రత్యేకంగా 16MP కెమెరాను చేర్చింది.

Smartphone Tips: పాత మొబైల్ అమ్ముతున్నారా? డేటా ఇలా డిలిట్ చేయండి

WhatsApp: టైప్ చేయకుండా వాట్సప్ మెసేజెస్ పంపండి ఇలా

ఈ డివైజ్ మోటో G60s ఆడ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్​తో రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ సిమ్ సపోర్ట్, వైఫై 802.11, బ్లూటూత్ v5.0, జీపీఎస్​ 4జీ, ఎన్​ఎఫ్​సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్​బీ టైప్-సి పోర్ట్ వంటివి చేర్చింది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ బటన్​తో పాటు గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా చేర్చింది.
Published by:Santhosh Kumar S
First published: