మోటోరోలా ఇండియా మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. గతేడాది రిలీజ్ చేసిన మోటో జీ51 5జీ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ వేరియంట్ అయిన మోటో జీ52 (Moto G52) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఇందులో 90Hz pOLED డిస్‌ప్లే , ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 (Qualcomm Snapdragon 680) ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఈ మొబైల్ రిలీజ్ చేసింది మోటోరోలా. ఇప్పటికే ఈ బడ్జెట్‌లో ఉన్న ఒప్పో కే10, రియల్‌మీ 9ఐ లాంటి మోడల్స్‌కు పోటీ ఇవ్వనుంది మోటో జీ52. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.
మోటో జీ52 ధర వివరాలు చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499. ఇవి ఇంట్రడక్టరీ ధరలు మాత్రమే. త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉంది. చార్‌కోల్ గ్రే, పోర్సీలెయిన్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. మే 3 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.13,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,499 ధరకు సొంతం చేసుకోవచ్చు.
Amazon Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... రూ.1,799 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం
Introducing the all-new #motog52 with revolutionary pOLED 90Hz display & up your style with India’s slimmest, & lightest smartphone in the segment! Starting at just 13,499*! Sale starts 3 May on @Flipkart and at leading retail stores #gowow
— Motorola India (@motorolaindia) April 25, 2022
మోటో జీ52 స్పెసిఫికేషన్స్
మోటో జీ52 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ pOLED డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగ్న్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెడ్‌మీ 10 పవర్, రియల్‌మీ 9 4జీ, ఒప్పో కే10, రెడ్‌మీ 10, రెడ్‌మీ నోట్ 11, వివో వై33టీ, రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 అప్‌గ్రేడ్‌తో పాటు మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.
Vivo Y21A: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలా? నెలకు రూ.472 ఈఎంఐ చాలు
మోటో జీ52 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో డ్యూయెల్ క్యాప్చర్, స్మార్ట్ కంపోజిషన్, స్పాట్ కలర్, లైవై మోటో, ప్రో మోషన్, అల్‌ట్రావైడ్ డిస్టార్షన్ కరెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
మోటో జీ52 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మెమొరీ కార్డుతో 1టీబీ స్టోరేజ్ పెంచుకోవచ్చు. డాల్బీ అట్మాస్ స్పీకర్స్, ఫేస్ అన్‌లాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Mobiles, Motorola, Smartphone