MOTO G51 VS REDMI NOTE 11T 5G KNOW WHICH IS THE BEST 5G SMARTPHONE AT RS 14999 PRICE SS
Moto G51 vs Redmi Note 11T 5G: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్? తెలుసుకోండి
Moto G51 vs Redmi Note 11T 5G: రూ.15,000 లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్? తెలుసుకోండి
Moto G51 vs Redmi Note 11T 5G | ఈ నెలలో రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లు (5G Smartphone) ఇండియాకు వచ్చాయి. రెడ్‌మీ నోట్ 11టీ సేల్ ఇప్పటికే ప్రారంభమైతే, మోటో జీ51 సేల్ త్వరలో ప్రారంభం కానుంది. మరి ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి.
మోటోరోలా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) ఇండియాకు వచ్చేసింది. మోటో జీ51 (Moto G51) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది మోటోరోలా ఇండియా. ఇటీవల ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ అయిన మరో 5జీ మొబైల్ ఇది. కొద్ది రోజుల క్రితం షావోమీ ఇండియా నుంచి రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G) మోడల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లో రూ.15,000 బడ్జెట్‌లో లభిస్తున్నాయి. మరి ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? రెడ్‌మీ నోట్ 11టీ 5జీ కొనొచ్చా? లేక మోటో జీ51 తీసుకోవాలా? ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? పోలికలు, తేడాలు ఏం ఉన్నాయో తెలుసుకోండి.
Dislplay: మోటో జీ51 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉండగా, రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మోటో జీ51 లో రిఫ్రెష్ రేట్, డిస్‌ప్లే సైజ్ ఎక్కువగా ఉంది.
RAM and Internal Storage: మోటో జీ51 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌తో లభిస్తే, రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో లభిస్తుంది. రెడ్‌మీ నోట్ 11టీ 5జీ బేస్ వేరియంట్‌లో 6జీబీ ర్యామ్ ఉండటం విశేషం.
Battery: మోటో జీ51 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 20వాట్ ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటం విశేషం.
Operating System: మోటో జీ51 ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ యాప్స్‌తో పాటు మోటోరోలాకు చెందిన ఒకట్రెండు యాప్స్ మాత్రమే ఉంటాయి. రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
Price: మోటో జీ51 ధర ఆఫర్ ధర రూ.14,999 కాగా, రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.16,999. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పోలిస్తే రూ.14,999 ప్రైస్‌లో రెడ్‌మీ నోట్ 11టీ 6జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. మోటో జీ51 మాత్రం 4జీబీ ర్యామ్‌తో లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.