Home /News /technology /

Moto G51 5G: అత్యంత చౌకైన 5జీ స్మార్ట్​ఫోన్​.. మోటో జీ 51 ధర ఎంత? లాంచింగ్ ఎప్పుడు?

Moto G51 5G: అత్యంత చౌకైన 5జీ స్మార్ట్​ఫోన్​.. మోటో జీ 51 ధర ఎంత? లాంచింగ్ ఎప్పుడు?

మోటో జీ51 5జీ మొబైల్

మోటో జీ51 5జీ మొబైల్

Moto G51 5g: ప్రస్తుతం మార్కెట్​లో లభిస్తున్న 5జీ ఫోన్లలో మోటో జీ 5జీ, మోటో ఎడ్జ్​ 20 ఫ్యూజన్​ రెండూ రూ. 20 వేల కంటే ఎక్కువ ధరలోనే విడుదలయ్యాయి. మోటో జీ సిరీస్​లో జీ 51తో పాటు మరో మూడు ఫోన్లు కూడా ఈ నెలాఖరులో భారత మార్కెట్​లోకి విడుదలకానున్నాయి.

ఇంకా చదవండి ...
లెనొవో (Lenovo)  యాజమాన్యంలోని మోటరోలా (Motorola) వరుసగా స్మార్ట్​ఫోన్లను రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మోటరోలా తన జీ సిరీస్​లో అనేక స్మార్ట్​ఫోన్లు రిలీజ్​ చేయగా.. ఇప్పుడు మరో స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. మోటో జీ 51 (Moto g 51) పేరుతో ఇది మార్కెట్​లోకి రానుంది. స్నాప్​డ్రాగన్​ 480+ ప్రాసెసర్​తో వస్తోన్న ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ (World cheapest 5g smart phone)గా రికార్డుకెక్కనుంది. పుకార్లు నిజమైతే వచ్చే నెలలో ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది. 91మొబైల్స్ తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో మోటో G51 5జీ ధర రూ. 19,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే నిజమైతే.. మోటో జీ సిరీస్ (Moto G series)​లో రూ. 20,000 లోపు లభించే 5 జీ స్మార్ట్​ఫోన్​గా నిలవనుంది.

వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్.. 7 రోజులకు పెరగనున్న ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’

ప్రస్తుతం మార్కెట్​లో లభిస్తున్న 5జీ ఫోన్లలో మోటో జీ 5జీ, మోటో ఎడ్జ్​ 20 ఫ్యూజన్​ రెండూ రూ. 20 వేల కంటే ఎక్కువ ధరలోనే విడుదలయ్యాయి. మోటో జీ సిరీస్​లో జీ 51తో పాటు మరో మూడు ఫోన్లు కూడా ఈ నెలాఖరులో భారత మార్కెట్​లోకి విడుదలకానున్నాయి. మోటో జీ200, మోటో జీ71 5జీ, మోటో జీ31 స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యే ఫోన్ల జాబితాలో ఉన్నాయి. మోటో జీ 51 మొత్తం రెండు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇండిగో బ్లూ, బ్రైట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.

వాట్సాప్​లో అదిరిపోయే ఫీచర్​.. స్టిక్కర్లను స్వయంగా డిజైన్​ చేసుకునే ఛాన్స్​.. ఎలాగంటే?

మోటో జీ51 5జీ స్పెసిఫికేషన్లు

మోటో జీ51 స్మార్ట్​ఫోన్​ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్​ ఎస్​ఓసీ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 5జీ చిప్‌సెట్‌ను అందించింది. ఇది స్నాప్‌డ్రాగన్ 480 చిప్ ఓవర్‌లాక్డ్ వెర్షన్​పై రన్​ అవుతుంది. ఈ ఫోన్ 5,000 mAh బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. ఇది గరిష్టంగా 10W ఛార్జింగ్​కు మద్దతిస్తుంది. మోటో జీ51 స్మార్ట్​ఫోన్​ 6.8- అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ ఎల్​సీడీ డిస్​ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. మోటో జీ51 5జీలో కూడా మోటో జీ71 వలె ట్రిపుల్ రియర్​ -కెమెరా సెటప్‌ను చేర్చింది. దీనిలో 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించింది. ఇది బ్రైట్ సిల్వర్, ఇండిగో బ్లూ, ఆక్వా బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Moto, Motorola, Smart phone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు