Moto G50 5G: మోటో జీ50 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్.. అదిరిపోయే ఫీచర్లు గల మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్...

ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ మోటరోలా వరుస స్మార్ట్​ఫోన్లను రిలీజ్​ చేస్తూ దూకుడుమీదుంది. తాజాగా మోటరోలా తన మోటో జీ50 5జీ స్మార్ట్​ఫోన్​ను ఆస్ట్రేలియన్ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ చేసింది.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ మోటరోలా వరుస స్మార్ట్​ఫోన్లను రిలీజ్​ చేస్తూ దూకుడుమీదుంది. తాజాగా మోటరోలా తన మోటో జీ50 5జీ స్మార్ట్​ఫోన్​ను ఆస్ట్రేలియన్ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ చేసింది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్​ చేస్తే ​ రెండు రోజుల బ్యాటరీ లైఫ్​ ఇస్తుంది.

మోటో జీ50 5జీ ధర

కొత్త మోటో జీ50 సింగిల్​ వేరియంట్​లో లభిస్తుంది. దీని 4జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్ మోడల్‌ AUD 399 (సుమారు రూ. 21,500) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. మోటో జీ50 5జీ మెటోరైట్ గ్రే కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. లెనోవా ఆస్ట్రేలియా సైట్​ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో లాంచ్​ అయిన ఈ ఫోన్​ భారత్​లో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు.

స్పెసిఫికేషన్లు

మోటో జీ50 5జీ స్మార్ట్​ఫోన్ ​ఆండ్రాయిడ్​ 11పై రన్ అవుతుంది. ఇది 6.5 -అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ఇది 4 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్‌తో లభిస్తుంది. హైబ్రిడ్ మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ సహాయంతో దీని స్టోరేజ్​ను 1టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే.. మోటో G50 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించింది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్​ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా వంటివి చేర్చింది. ఇక, దీని వెనుకవైపు LED ఫ్లాష్ కెమెరాను కూడా అందించింది. బ్యాక్​ కెమెరా మోడ్‌లలో మాక్రో వీడియో, స్లో మోషన్ వీడియో, టైమ్‌లాప్స్, హైపర్‌లాప్స్, స్పాట్ కలర్ వంటివి అందించింది. దీని ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చింది. ఇక, ఈ స్మార్ట్​ఫోన్​లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000 mAh బ్యాటరీని చేర్చింది. ఇది రెండు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని పేర్కొంది. బాక్స్ లోపల 10W ఛార్జర్​ను అందించింది. ఇక, దీని పవర్ బటన్ క్రింద సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్​ను కూడా చేర్చింది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. యూఎస్​బీ టైప్-సి పోర్ట్, ఎన్​ఎఫ్​సీ, వైఫై ఏసీ, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5, జీపీఎస్​, 5జీ వంటివి అందించింది.
Published by:Krishna Adithya
First published: