Home /News /technology /

MOTO G42 LAUNCHED IN INDIA WITH AMOLED DISPLAY TRIPLE CAMERAS UMG GH

Moto G42: ఇండియన్ మార్కెట్‌లోకి మోటో మరో మొబైల్.. ట్రిపుల్ కెమెరాతో ఫుల్ కిక్కెక్కించే ఫీచర్లు..!

ఇండియాలో మోటో జీ42 లాంచ్

ఇండియాలో మోటో జీ42 లాంచ్

మోటొరోలా (Motorola) కంపెనీ మరో బడ్జెట్ డివైజ్‌ను రిలీజ్ చేసింది. మోటో జీ42 (Moto G42) పేరుతో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone)ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ మోడల్‌తో కంపెనీ తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లను అందిస్తోంది.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ అందుబాటులోకి వచ్చింది. ఈసారి మోటొరోలా (Motorola) కంపెనీ బడ్జెట్ డివైజ్‌ను రిలీజ్ చేసింది. మోటో జీ42 (Moto G42) పేరుతో సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ మోడల్‌తో కంపెనీ తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లను అందిస్తోంది. తాజా ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ వంటి మరిన్ని టాప్ రేంజ్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. దీని ధర, ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.

* మోటో G42 ధర, ఆఫర్లు
మోటో G42 స్మార్ట్‌ఫోన్‌ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లాంచ్ అయింది. ఇండియాలో దీని ధర రూ. 13,999గా ఉంది. యూజర్లు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ లాంచింగ్ ఆఫర్‌ను ప్రకటించింది. SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వినియోగదారులు రూ. 1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీనితో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 12,999కి తగ్గుతుంది. జియో యూజర్లు రూ. 2,549 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. మోటో G42 రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మెటాలిక్ రోజ్, అట్లాంటిక్ గ్రీన్ కలర్లతో ఇది ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: వాట్సాప్ సూపర్ అప్‌డేట్.. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‌ పెంపు.. ఎన్ని రోజులంటే..?


* స్పెసిఫికేషన్లు
మోటో G42 ఫుల్ HD+ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. మోటో G42 ఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. కంపెనీ ఈ డివైజ్‌లో క్వాలిటీ ఆప్టిక్స్ అందించింది. మోటో G42 బడ్జెట్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఈ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.



ఈ డివైజ్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌కు సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. క్యారియర్ అగ్రిగేషన్, NFC, FM రేడియో, కాల్స్ కోసం డ్యుయల్ నాయిస్ క్యాన్సిలేషన్‌ వంటివి దీని అదనపు స్పెసిఫికేషన్లు. మోటొరోలా G-సిరీస్‌ నుంచి వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. రెడ్‌మీ నోట్ 11, రియల్‌మీ 9i, శామ్‌సంగ్ గెలాక్సీ M13 వంటి ఫోన్లతో పోటీ పడనుంది. వీటన్నింటి ధరలు రూ. 15,000లోపే ఉన్నాయి.
Published by:Mahesh
First published:

Tags: 5g smart phone, Budget smart phone, Moto, Tech news

తదుపరి వార్తలు