ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా (Motorola) స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. మరో కొత్త మోడల్ ను (New Smartphone) మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ ధరకే మరో బెస్ట్ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించింది. ఈ ఫోన్ ధర రూ.13,999 మాత్రమే కావడం విశేషం. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కొనుగోలుపై బెస్ట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ.1000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ను రూ.12,999కే కొనుగోలు చేసుకోవచ్చు. జియో యూజర్లకు రూ.2,549 ప్రయోజనలు ఉన్నాయి. ఈ ఫోన్ Metallic Rose, Atlantic Green కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
MOTO G42 స్పెసిఫికేషన్లు:
ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.4 అంగుళాల అల్మోడ్ డిస్ప్లే ఈ ఫోన్ సొంతం. ఇంకా ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఈ ఫోన్ సొంతం. ఇంకా 60hz రీఫ్రెష్ రేట్ ను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ ల్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్ ఉంటుంది. ఇంకా 4GB+64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పొడిగించుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ 5,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. Midrange Phones: మిడ్ రేంజ్లో మైండ్ బ్లోయింగ్ మొబైల్స్ ఇవే..! వన్ప్లస్, పోకో, ఐక్యూ నియోలో బెస్ట్ ఫోన్ ఏదంటే..?
ఇంకా కెమెరా విషయానికి వస్తే.. MOTO G42 ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 2-మెగా పిక్సెల్ మైక్రో షూటర్ ఈ ఫోన్ లో ఉంటాయి. ఇంకా సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇంకా కనెక్టివిటీ కోసం e 4G LTE, వై-ఫై, బ్లూటూత్, GPS/ A-GPS, a 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్లో ఇవ్వబడింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.