మోటొరోలా కంపెనీ జీ సిరీస్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ32 పేరుతో ఈ ఫోన్‌ను, యూరోపియన్ మార్కెట్‌లలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో విడుదల చేసింది. త్వరలోనే భారతదేశం, లాటిన్ అమెరికాలలో ఈ కొత్త డివైజ్ లాంచ్ కానుంది. దీని ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
* మోటో జీ32 ధర
మోటో జీ32 4GB/128GB సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే విడుదలైంది. దీని ధర 230 యురోస్. భారత కరెన్సీలో దాదాపు రూ.18,650. ఈ స్మార్ట్ ఫోన్ రోజ్‌గోల్డ్, శాటిన్ సిల్వర్, మినరల్ గ్రే కలర్స్‌లో లభించనుంది.
* స్పెసిఫికేషన్లు
మోటో జీ32లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ (Qualcomm Snapdragon) 680 SoC ప్రాసెర్ ఉపయోగించారు. ఇందులో 4GB RAM ఉండగా, 128GB వరకు స్టోరేజ్‌ను ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఈ ఫోన్ 5,000 mAh బ్యాటరీతో 30వాట్స్ టర్బోఫవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12పై మోటొరోలా నియర్-స్టాక్ MyUX స్కిన్‌తో రన్ అవుతుంది.
హోల్-పంచ్ కెమెరా కటౌట్‌తో 6.5-అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ (FHD+ IPS LCD) ప్యానెల్‌తో ఫోన్ లాంచ్ అయింది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 405 ppi పిక్సెల్ డెన్సిటీతో స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫోన్ వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 2 మోగా పిక్సెల్ మాక్రో యూనిట్ ఉన్నాయి. ముందు భాగంలో క్వాడ్ బేయర్ ఫిల్టర్‌తో 16 మోగా పిక్సెల్(MP) సెల్ఫీ కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G LTE, wi-fi, బ్లూటూత్, NFC, USB-C పోర్ట్‌తోపాటు మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మోటో జీ32లో హెడ్‌ఫోన్ జాక్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వినియోగించారు. అంతేకాకుండా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్, వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో వస్తుంది.
కాగా, మోటొరోలా కంపెనీ తాజా మోటో జీ32 మోడల్‌ను భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తుందో అధికారికంగా ప్రకటించలేదు. అయితే టెక్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే ఇది విడుదలవుతుందని తెలుస్తోంది.
మరోవైపు.. ఏకంగా 200 మెగాపిక్సల్ కెమెరాతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి మోటొరోలా ప్రయత్నాలు చేస్తోంది. మోటో X30 Pro పేరుతో 200 మోగా పిక్సెల్ కెమెరా స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ తీసుకురానుంది. ఆగస్టు 2న చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మోటో X30 Proలో స్నాప్‌డ్రాగన్ 8+ జన్1 ప్రాసెసర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12తో పనిచేసే ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండనున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g smart phone, Moto, Motorola, Smart phone