మోటోరోలా ఇండియా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) రిలీజ్ అయింది. మోటో జీ సిరీస్‌లో మోటో జీ13 (Moto G13) మోడల్ రిలీజ్ చేసింది. కేవలం రూ.10,000 లోపు ఈ మొబైల్ రిలీజైంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్, 50MP కెమెరా, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ లాంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పటికే రూ.10,000 లోపు బడ్జెట్‌లో షావోమీ రియల్‌మీ, వివో లాంటి బ్రాండ్ల నుంచి పలు స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. వాటికి మోటో జీ13 గట్టి పోటీ ఇవ్వనుంది. మరి మోటో జీ13 ప్రత్యేకతలేంటీ? ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మోటో జీ13 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 4జీబీ ర్యామ్ + 64జీబీ వేరియంట్ ధర రూ.9,499 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.9,999. ఏప్రిల్ 5న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ , మోటోరోలా ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో కొనొచ్చు. మ్యాటీ చార్‌కోల్, లావెండర్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
OnePlus Offer: అదిరిపోయే ఆఫర్... ఇప్పుడు ఈ రూ.30,000 లోపే వన్‌ప్లస్ మొబైల్ కొనొచ్చు
Get ready for #motog13, a premium & #Hatke design that’s thoughtfully crafted. Store everything you love with 128GB Storage & multi-task with 4GB RAM. Get #HatkeExperience with latest Android™ 13 & much more at ₹9,999. Sale starts 5 April on @flipkart & leading retail stores.
— Motorola India (@motorolaindia) March 29, 2023
మోటో జీ13 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టెక్నో స్పార్క్ 8 ప్రో, రెడ్‌మీ నోట్ 9, రియల్‌మీ నార్జో 50ఏ లాంటి మోడల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. మెమొరీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో గూగుల్ యాప్స్, మోటోరోలా యాప్స్ తప్ప ఇతర బ్లోట్‌వేర్ ఉండదు.
JioFiber Plan: కేవలం రూ.198 కే జియోఫైబర్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
మోటో జీ13 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలో నైట్ విజన్ మోడ్, పోర్ట్‌రైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయెల్ సిమ్ కార్డ్ స్లాట్స్, డాల్బీ అట్మాస్‌తో డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, థింక్‌షీల్డ్ ప్రొటెక్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Motorola, Smartphone