HOME »NEWS »TECHNOLOGY »moto g 5g vs oneplus nord 5g know comparison features specifications and price ss

Moto G 5G vs OnePlus Nord 5G: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Moto G 5G vs OnePlus Nord 5G: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి
Moto G 5G vs OnePlus Nord 5G: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Moto G 5G vs OnePlus Nord 5G | మీరు 5 జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? లేటెస్ట్‌గా రిలీజైన మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ నార్డ్ 5జీ మధ్య పోలికలు, తేడాలు, ప్రత్యేకతలు తెలుసుకోండి.

  • Share this:
మోటోరోలా నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 5జీ ఇండియాలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇండియాలో 5జీ నెట్వర్క్ లేదు. 5జీ నెట్వర్క్ ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుందన్న స్పష్టత కూడా లేదు. కానీ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా 5జీ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు కూడా వీటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లేటెస్ట్‌గా రిలీజైన మోటో జీ 5జీ ఇప్పటికే రిలీజ్ అయిన 5జీ స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇవ్వనుంది. ఇదే సెగ్మెంట్‌లో రిలీజ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు మోటో జీ 5జీ మోడల్ నుంచి పోటీ తప్పదు. మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో హైలైట్స్ చూస్తే 48మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 6.7 అంగుళాల భారీ డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి విశేషాలు ఉన్నాయి. ఇక వన్‌ప్లస్ నార్డ్ ప్రత్యేకతలు చూస్తే స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్, 48మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, 6.44 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 4,115ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ ప్రారంభ ధర రూ.24,999 కాగా మోటో జీ 5జీ ధర రూ.20,999. మరి ఈ రెండు ఫోన్లలో ఫీచర్స్ ఏంటీ, ఫీచర్లలో తేడాలు ఏంటీ తెలుసుకోండి.

Power Bank: పవర్ బ్యాంక్ వాడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే



Best Apps of 2020: ఈ ఏడాది బెస్ట్ యాప్స్ ఇవే... ప్రకటించిన గూగుల్































































 మోటో జీ 5జీ వన్‌ప్లస్ నార్డ్
 డిస్‌ప్లే  6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే  6.44 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే
 ర్యామ్  6జీబీ  6జీబీ, 8జీబీ, 12జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్  128జీబీ  64జీబీ, 128జీబీ, 256జీబీ
 ప్రాసెసర్  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ  స్నాప్‌డ్రాగన్ 765జీ
 రియర్ కెమెరా  48 మెగాపిక్సెల్ ప్రైమసీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్  48+8+5+2 మెగాపిక్సెల్
 ఫ్రంట్ కెమెరా  16 మెగాపిక్సెల్  32+8 మెగాపిక్సెల్
 బ్యాటరీ  5,000ఎంఏహెచ్ (20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)  4,115ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
 ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 10  ఆక్సిజన్ ఓఎస్ 10.0 + ఆండ్రాయిడ్ 10
 సిమ్ సపోర్ట్  డ్యూయెల్ సిమ్  డ్యూయెల్ సిమ్
 కలర్స్  ఫ్రోస్టెడ్ సిల్వర్, వోల్కానిక్ గ్రే  గ్రే ఓనిక్స్, బ్లూ మార్బుల్, గ్రే యాష్
 ధర  రూ.20,999 (ఆఫర్ ధర రూ.19,999)  6జీబీ+64జీబీ- రూ.24,999
8జీబీ+128జీబీ- రూ.27,999
12జీబీ+256జీబీ- రూ.29,999
Published by:Santhosh Kumar S
First published:December 01, 2020, 17:10 pm