• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • MOTO G 5G LAUNCHED IN INDIA WITH 5000 MAH BATTERY AND QUALCOMM SNAPDRAGON 750G CHIPSET SS

ఇండియాలో రిలీజైన మరో 5జీ స్మార్ట్‌ఫోన్... Moto G 5G ప్రత్యేకతలు ఇవే

ఇండియాలో రిలీజైన మరో 5జీ స్మార్ట్‌ఫోన్... Moto G 5G ప్రత్యేకతలు ఇవే

ఇండియాలో రిలీజైన మరో 5జీ స్మార్ట్‌ఫోన్... Moto G 5G ప్రత్యేకతలు ఇవే (image: Motorola)

Moto G 5G | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మోటోరోలా నుంచి మోటో జీ 5జీ రిలీజైంది. ప్రత్యేకతలు తెలుసుకోండి.

  • Share this:
    ఇండియాలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. మోటోరోలా నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మోటో జీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు పరిచయం చేసింది మోటోరోలా. కొంతకాలంగా ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మోటోరోలా రిలీజ్ చేయడం విశేషం. ఇప్పటికే ఇండియన్ మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. కొంతకాలం క్రితం రిలీజైన వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌కు మోటో జీ 5జీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మోటో జీ 5జీ ప్రత్యేకతలు చూస్తే 6.7 అంగుళాల భారీ డిస్‌ప్లే, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 48మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఉండటంతో లోలైట్‌లో కూడా మంచి పర్ఫామెన్స్ ఉంటుంది. ముందువైపు నైట్ విజన్ మోడ్ ఉండటం విశేషం. 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 15 నిమిషాలు రీఛార్జ్ చేస్తే 10 గంటలపాటు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించొచ్చు. మోటో జీ 5జీ ధర రూ.20,999. ఆఫర్‌లో రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.19,999 ధరకే ఈ ఫోన్ కొనొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. డిసెంబర్ 7 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభం కానుంది.

    WhatsApp Trick: సీక్రెట్‌గా వాట్సప్ స్టేటస్ చూడొచ్చు ఇలా

    Nokia 2.4: రూ.10,399 ధరకే నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే


    మోటో జీ 5జీ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లే
    ర్యామ్: 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమసీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: ఫ్రోస్టెడ్ సిల్వర్, వోల్కానిక్ గ్రే
    ధర: రూ.20,999 (ఆఫర్ ధర రూ.19,999)

    WhatsApp Payments: రిజిస్టర్ నుంచి ట్రాన్సాక్షన్ వరకు... వాట్సప్ పేమెంట్స్‌లో మీ సందేహాలకు సమాధానాలు ఇవే

    Phone Call: ఫోన్ కాల్ చేస్తున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోండి

    ప్రస్తుతం ఇండియాలో 5జీ నెట్వర్క్ అందుబాటులో లేదు. అయితే భారతదేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 5జీ స్మార్ట్‌ఫోన్ కొనే యూజర్లు మొబైల్ మార్చాల్సిన అవసరం లేకుండానే 5జీ నెట్వర్క్ ఉపయోగించుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు